end
=
Monday, January 20, 2025
వార్తలుజాతీయంతరుణ్‌ గొగోయ్‌ కన్నుమూత
- Advertisment -

తరుణ్‌ గొగోయ్‌ కన్నుమూత

- Advertisment -
- Advertisment -

గువాహటి: అసోం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్‌ నేత తరుణ్ గొగోయ్(84) కన్నుమూశారు. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమాంత్ బిస్వా శర్మ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. అసోంకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా, ఆరుసార్లుఎంపీగా పనిచేసిన తరుణ్ గొగోయ్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితర ప్రముఖులు సంతాపం తెలిపారు. దిగ్గజ నాయకుడికి కోల్పోయామని కాంగ్రెస్ నాయకులు విచారం వ్యక్తం చేశారు.

ఇటీవల కోవిడ్ బారిన పడి కోలుకున్న తరుణ్ గొగోయ్.. తిరిగి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో గువాహటి మెడికల్కా లేజీలో కొద్దిరోజులుగా వైద్యుల నిరంతర పర్యవేక్షణలో చికిత్స పొందుతూ వచ్చారు. ఆదివారం నాడు పరిస్థితి కుదుటపడుతున్ననట్టు అనిపించినా, వెంటనే పరిస్థితి పూర్తిగా వైద్యుల చేయిజారిపోయినట్లు తెలుస్తోంది. తమ వంతు ప్రయత్నం చేశామనీ.. ఇక భగవంతుడి అనుగ్రహం, ప్రజల ప్రార్థనలతోనే ఆయన కోలుకోవాలని వైద్యులు ప్రకటించడంతో ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ తన పర్యటన రద్దు చేసుకుని గువాహటి తిరిగొచ్చారు. ఆ కొద్ది సేపటికే ఆయన తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -