దేశీయ దిగ్గజ కంపెనీ టాటా గ్రూప్ (Tata Group) డిజిటల్ ఎకానమీ (Digital Economy) రంగంలో తన సత్తా చాటేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 7న టాటా సూపర్ యాప్ “న్యూ (Neu)” ప్రజలందరికీ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం టెస్టింగ్‌లో భాగంగా టాటా గ్రూప్ ఉద్యోగులు కొంతకాలంగా ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో 7వ తేదీన లాంచ్ అయ్యాక ప్రజలందరూ టాటా న్యూ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని వాడవచ్చు. ఈ విషయాన్ని టాటా డిజిటల్ వెల్లడించింది.
నిత్యవసర వస్తువులు, ఎలక్ట్రానిక్స్, పేమెంట్స్ దగ్గరి నుంచి విమాన టికెట్ల వరకు దాదాపు టాటా సంస్థల సర్వీస్‌లన్నీ ఈ యాప్‌లో ఉంటాయి. అలాగే ఈ యాప్‌లో ప్రత్యేకమైన ఆఫర్లు, రివార్డు పాయింట్లు కూడా లభిస్తాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జియో, పేటీఎం, గూగుల్ పే లాంటి ప్లాట్‌ఫామ్‌లకు Tata Neu గట్టిపోటీని ఇచ్చేందుకు సిద్ధమైంది. మంచి బ్రాండ్ నేమ్, బలమైన ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ విభాగాలు ఉండడంతో టాటా న్యూ యాప్ వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఈ యాప్‌కు ఆకర్షితులయ్యేందుకు ఇవి ప్రధాన కారణాలు కావొచ్చు.