end
=
Sunday, January 19, 2025
వార్తలుజాతీయంక్యాబినెట్‌ స్పెల్లింగ్‌ రానోడు సీఎంను దూషిస్తాడా..
- Advertisment -

క్యాబినెట్‌ స్పెల్లింగ్‌ రానోడు సీఎంను దూషిస్తాడా..

- Advertisment -
- Advertisment -

-కేంద్ర మంత్రి అశ్విని చౌబే

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే తొలివిడత ఎన్నికలు జరగ్గా.. పూర్తి స్థాయి ఎన్నికలు జరిగబోతున్నాయి. ఈ సందర్భంలో ఆర్జేడీ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్‌పై కేంద్రమంత్రి అశ్విని చౌబే విమర్శలు గుప్పించారు. కనీసం క్యాబినెట్ స్పెల్లింగ్‌ రాని వ్యక్తి సీఎం అభ్యర్థిగా నిలవడమే దరిద్రమంటే.. సీఎం నితీశ్‌పై లేనిపోని వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. ప్రస్తుతం ఆర్జేడీ పరిస్థితి చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందనీ.. వారికి కాంగ్రెస్‌ పార్టీ మద్దతిచ్చినా గెలుపు దరిదాపుల్లోకి కూడా రాదని ఆయన ఎద్దేవా చేశారు.

తండ్రి వారసత్వంతో ఎలాంటి క్వాలిఫికేషన్‌ లేని వ్యక్తి సీఎం అభ్యర్థిగా పోటీచేయడం శోచనీయం అని చౌబే అన్నారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ జైల్లో మగ్గుతుండడంతో వారికి ఏమి తోచడం లేదనీ.. అందుకే ఎన్నికల ప్రచారంలో నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నాడని కేంద్ర మంత్రి విమర్శలు చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -