end

Telangana:తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

  • డిసెంబర్‌లోనే జరపాలని నిర్ణయించిన కేసీఆర్
  • వారం రోజులపాటు సాగనున్న శాసనసభ మీటింగ్


తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (CM K. Chandrasekhar Rao) డిసెంబర్‌ (December)లోనే అసెంబ్లీ సమావేశాలు (Assembly meetings) నిర్వహించాలని నిర్ణయంచారు. వారం (1 week) రోజుల పాటు సాగే ఈ సమావేశాలు నిర్వహణకు చర్యలు తీసుకోవాలని మంత్రులు హరీష్‌ రావు, ప్రశాంత్‌రెడ్డి (Harish Rao, Prashanth Reddy)ని కేసీఆర్ ఆదేశించారు. ఇక ఈ సారి ఎక్కువ భాగం కేంద్ర ప్రభుత్వ (Central Govt) ఆంక్షలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి (Financial condition of the state)పై చర్చించాలని ప్లాన్న చేస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణపై మోదీ (Modi) ప్రభుత్వ వైఖరిపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆంక్షల వల్ల తెలంగాణ రూ.40 వేల కోట్ల ఆదాయం కోల్పోయిందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇదే అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో కేంద్రాన్ని ఎండగట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఈడీ (ED), ఐటీ (IT)దాడులను సమావేశాల్లో సీఎం కేసీఆర్ ఎండగట్టాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తమ అధీనంలోని దర్యాప్తు సంస్థలతో రాష్ట్రంలో వరుస దాడులతో బెంబేలెత్తిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై ఎదురుదాడికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

(Greater Hyderabad:మరో ఫ్లై ఓవర్ బ్రిడ్జి సిద్ధం చేసిన జీఎచ్‌ఎంసీ)

ఇందుకోసం రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులను(Employees of Central Govt) లక్ష్యంగా (Target) చేసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే అవినీతి నిరోధక బృందాన్ని (ఏసీబీ)ని ‘ACB’ ఇందుకు అస్త్రంగా వాడుకోనుంది. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారం అందినా, ఎవరి నుంచైనా లంచం డిమాండ్‌ (Bribe demand) చేసినట్లుగానీ, లంచం తీసుకున్నట్లుగానీ ఫిర్యాదులు (COMPLAINT) అందినా.. ఆ ఉద్యోగులపై అవినీతి నిరోధక చట్టం కింద నేరుగా కేసులు నమోదు చేసి విచారణ చేపట్టనుంది. అవినీతి నిరోధక చట్టం (Prevention of Corruption Act) ప్రకారం రాష్ట్ర ఏసీబీకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు పెట్టేందుకు అవకాశం ఉండటంతో దాని ఆధారంగా ఎదురుదాడికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

Exit mobile version