end
=
Sunday, July 7, 2024
విద్యా సమాచారంసెప్టెంబర్‌ 30న గురుకుల ప్రవేశ పరీక్షలు
- Advertisment -

సెప్టెంబర్‌ 30న గురుకుల ప్రవేశ పరీక్షలు

- Advertisment -
- Advertisment -

తెలంగాణలో గురుకుల జూనియర్‌ కళశాల, డిగ్రీ కళాశాలల్లో 2020-2021 విద్యా సంవత్సరంకు గాను ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి వెల్లడించారు. కరోనా వైరస్‌ వల్ల రాష్ర్టంలో లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. అయితే అన్ని విద్యాలయాలతోపాటు గురుకుల పాఠశాలలు, కళాశాలలు కూడా మూసి వేశారు. అన్‌లాక్‌లో భాగంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గురుకుల కళాశాలల అడ్మీషన్లకు అనుమతి ఇచ్చింది.

కరోనా వైరస్‌తో మాదాపూర్‌ ఎస్‌.ఐ మృతి

అయితే అర్హత పరీక్షలు నిర్వహించడానికి విద్యా శాఖ అధికారులు కోవిడ్‌ నిబంధనలను అనుసరించి ఏర్పాటు చేస్తున్నారు. మహాత్మా జ్యోతిరావుపూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల జూనియర్‌ కళాశాల, మహిళా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కొరకు సెప్టెంబర్‌ 30న ప్రవేశ పరీక్ష నిర్వహించబోతున్నట్లు కార్యదర్శి మల్లయ్యభట్టు తెలిపారు.

ప్రగతిభవన్‌ ముందు నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం

ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించి హాల్‌టికెట్లు ఈ నెల 24 నుండి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. విద్యార్థులు సంస్థ వెబ్‌సైట్‌ నుండి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. అయితే పరీక్షా కేంద్రాలను 10 జిల్లాలకు బదులుగా 33 జిల్లాలలో నిర్వహించబోతున్నట్లు సంస్థ కార్యదర్శి తెలిపారు. అదేవిధంగా విద్యార్థులు కోవిడ్‌ 19 నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

మత్తు ఇంజక్షన్లు విక్రయిస్తున్న ముఠా అరెస్టు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -