Telangana Lok Sabha Result : తెలంగాణ లోక్‌సభ స్థానాలు 17 ఉండగా మూడు పార్టీలు నువ్వా నేనా! అనే విధంగా ఉన్నాయి. రాష్ర్ట వ్యాప్తంగా 120 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేయగా 1855 కౌంటింగ్ టేబుళ్లపై ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. తెలంగాణ ఎన్నికల్లో మొత్తం 2,20,24,806 మంది ఓటర్లు ఓటు వినియోగించుకున్నారు.
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజీపీ బీఆర్‌ఎస్ కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. అందులో ముఖ్యంగా హైదరాబాద్ లోక్ స్థానం యంఐయం అసుదుద్దీన్ ( AIMIM) వరుసగా నాలుగుసార్లు ఓటమి అనేది లేకుండా గెలుస్తున్నాడు. ఈసారి బీజీపీ పార్టీ తరుపున మోది (BJP) చతురతతో కొంపెల్లి మాధవీలత బరిలో దిగగా ప్రచారంలో దూసుకపోయింది. (Madvi latha) హైదరాబాద్‌లో రెండో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలత ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
యంఐయం అభ్యర్థి అసుదుద్దీన్‌పై ఆమె 3,276 వేల ఓట్లకు పైగా ఆధిక్యం సాధించారు. కరీంనగర్‌లో బండి సంజయ్ 39,319 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. సికింద్రాబాద్‌లో కిషన్ రెడ్డి 12,212 ఓట్ల మెజార్టీతో లీడ్‌లో కొనసాగుతున్నారు. (Medak) మెదక్‌లో ఇప్పటి వరకు మూడు రౌండ్లు ముగిసాయి. బీఆర్‌ఎస్ ముందంజలో ఉండగా కాంగ్రెస్ మధ్యస్తంగా కొనసాగుతుండగా బీజీపీ బారసాకు గట్టి పోటి ఇస్తుంది. రౌండ్ రౌండ్‌కు పార్టీ నాయకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.