end

Siddipet:తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం(International Day of Persons with Disabilities) వేడుకలను మన సిద్దిపేట జిల్లాలో డిసెంబర్ 5వ తేదీ ఉదయము 9 గంటల నుండి పట్టణంలోని కొండమల్లయ్య గార్డెన్స్ లో గౌరవ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు(Harish Rao) ముఖ్యఅతిథిగా వేడుకలు జరపబడుచుకున్నది వేడుకల సందర్భంగా, గౌరవ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారి చొరవతో మరియు ఆదేశాలతో, తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ, హైదరాబాద్ వారు ALIMCO సంస్థ (Artificial Limb Manufacturing Corporation of India) నిపుణుల సహకారంతో శారీరక దివ్యాంగులకు అవసరమగు బ్యాటరి తో నడిచే ట్రై సైకిల్, కాలిపర్స్ మరియు కృత్రిమ కాళ్ళు అందజేయుటకు గాను ఎంపిక శిభిరమును డిసెంబర్ 5వ తేది న సిద్దిపేట జిల్లా కేంద్రం లోని కొండ మల్లయ్య గార్డెన్, సిద్దిపేట నందు ఉదయం 9 గంటల నుండి జరుపబడును.

 ఇట్టి శిబిరమునకు ఈ దిగువ సూచించిన అర్హతలు మరియు వైకల్యం గలవారు మాత్రమే హాజరు కావలెను.

బ్యాటరీ ట్రై సైకిల్(Battery Tricycle) :

శారీరక దివ్యాంగులు దిగువ అవయవాలలో (కాళ్ళలో) తీవ్రమైన వైకల్యం కలిగి ఉండి మరియు ఎగువ అవయవాలు (రెండు చేతులు) మంచి స్థితిలో (సాధారణంగా) ఉండి వాహనం నడిపగలిగి ఉండే వారు అర్హులు. వైకల్య శాతం 80% ఆ పై ఉండాలి మరియు వయసు 16 సం.లు పైబడి ఉండాలి. కుటుంబ నెలసరి ఆదాయం రూ.15,000/- మించకుండా ఉండి ఉండాలి. ప్రభుత్వం (తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ, హైదరాబాద్) చే ఇదివరకే మోటోరైజేడ్ వాహనం పొందిన వారు బ్యాటరీ ట్రై సైకిల్ పొందుటకు అనర్హులు.

(ఏపీలో తూటాల్లా పేలుతున్న నేతల మాటలు)

కాలిపర్స్ :

శారీరక దివ్యాంగులు దిగువ అవయవాలలో (కాళ్ళు) పోలియో మరియు మస్తిష్క పక్షవాతము కలిగిన వారు అర్హులు. ఇట్టి శిబిరములో కొలతలు మత్రమే తీసుకొబడును.

కృత్రిమ అవయవాలు :

శారీరక దివ్యాంగులు కాళ్ళు తొలగించబడిన వారు కృత్రిమ కాళ్ళు అమర్చుటకు అర్హులు. ఇట్టి శిబిరములో కొలతలు మత్రమే తీసుకొబడును. తదుపరి వాటిని తయారు చేసి అమర్చుటకు మరొక శిభిరము (Fitment camp) ఏర్పాటు చేసి తెలియజేయబడును.

   ముఖ్య గమనిక:

1)     ఇట్టి శిభిరమునకు హాజరగు అభ్యర్థులు తమ ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, వైకల్య ధృవీకరణ పత్రం (SADAREM) మరియు (3) పాస్ పోర్ట్ సైజు ఫోటోలు తప్పక తీసుకు రావలెను.

2)     పైన సూచించిన అర్హతలు మరియు వైకల్యం గల వారు మత్రమే హాజరు కావలెను, అర్హత లేని శారీరక దివ్యాంగులు మరియు ఇతర కేటగిరి దివ్యాంగులు శిభిరమునకు వచ్చి ఇబ్బంది పడవద్దని మనవి.

Exit mobile version