దేశీయ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా(Vodafone Idea)తమ ప్రీమియం మొబైల్ రెడ్ఎక్స్ ప్లాన్‌లను తొలగించినట్టు తెలుస్తోంది. ఫ్లాగ్‌షిప్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లుగా పరిగణించబడుతున్న వీటిని వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్‌లలో తీసివేసింది. అయితే, ఇప్పటికే ఈ ప్లాన్‌లను రీఛార్జ్ చేసుకున్నవారికి వ్యాలిడిటీ ముగిసే వరకు అందుబాటులో ఉండనుంది. ఆ తర్వాత కొత్తగా రీఛార్జ్ చేసుకునేందుకు అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. వొడాఫోన్ ఐడియా ప్రస్తుతానికి అన్ని భౌతిక స్టోర్లలో రెడ్ఎక్స్ ప్లాన్(RedX plan)లను అందుబాటులో ఉన్నట్టు కంపెనీ ఎగ్జిక్యూటివ్ అధికారి ఒకరు పేర్కొన్నారు. దీన్ని బట్టి, వినియోగదారులు ఈ రెడ్ఎక్స్ ప్లాన్‌లను ఆన్‌లైన్‌లో రీఛార్జ్(Recharge) చేసుకునేందుకు వీలవదని, కొత్త పోస్ట్ పెయిడ్ సిమ్ కొన్నవారికి రెడ్ఎక్స్ ప్లాన్‌తో కలిపి కొనుగోలు చేసుకోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అయితే, దీనికి సంబంధించి వొడాఫోన్ అడియా మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉందని, రెడ్ఎక్స్ ప్లాన్‌లను తొలగించడం వెనక కారణాలను(Reason) వెల్లడించాల్సి ఉందని వారు పేర్కొన్నారు. కాగా, ప్రీమియం విభాగంలో ఉన్న రెడ్ఎక్స్ ప్లాన్‌ల ద్వారా వినియోగదారులకు అనేక ప్రయోజనాలు(Benefits) లభించాయి. అపరిమిత డేటాతో పాటు పలు ఓటీటీ(OTT) సేవలను ఏడాది పాటు యాకెస్‌తో పాటు అనేక రకాల ప్రయోజనాలను అందించాయి.