తెలుగు సినీమా, సీరియల్ నటి శివపార్వతికి కరోనా సోకింది. ఆమె చాలా అస్వస్థతకు గురైనట్లు ఓ విడియో ద్వారా తెలిపింది. ఎంత పెద్ద ఆర్టిస్టు అయితేనేం, ఎంత డబ్బు ఉంటేనేం అందరి ప్రాణాలు అనేది ఒకటే. నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. మళ్లీ ఇంటికి వస్తానో లేదో అన్న పరిస్థితిలోకి వెళ్లిపోయాను. పది రోజులు ఆస్పత్రిలోనే ఉన్నాను. ఆ తర్వాత నిన్న రాత్రి ఇంటికి చేరాను.ఈ మధ్యనే రెండు ఆసుపత్రులు మారాను. ఈ విషయం ప్రభాకర్‌కు అతని యూనిట్‌కు కూడా తెలుసు.
( తండ్రి లాప్టాప్లో కూతురి ప్రైవేటు ఫోటోలు, వీడియోలు! )
ఈ విషయంలో నేను ఎవర్నీ ఏమీ అనదలుచుకోలేదు. థ్యాంక్స్ చెప్పదల్చుకున్నాను. ఎందుకంటే ఈ పరిస్థితి రాకపోతే ఎవరేంటి? అని తెలిసేది కాదు. కానీ ఇప్పుడు తెలిసింది. ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా, చిన్న ఆర్టిస్ట్ అయినా ప్రాణం అనేది ఒకటే, ఆపద అనేది ఒకటే. కరోనా చిన్న విషయం కాదు. అందుకే అందరు జాగ్రత్తగా ఉండండి అని భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు.