end

MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద ఉద్రిక్తత

MLC Kavitha : టీఆర్‌ఎస్‌(TRS) ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఢిల్లీ లిక్కర్‌ (Delhi Liquer Scam) కుంభకోణంలో కవితపై ఆరోపణలు రావడంతో కవితను ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ బీజేవైఎం(BJYM) కార్యకర్తలు కవిత ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. ఈ సంఘటనలో పోలీసులు, భాజపా నేతల మధ్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు భాజపా నేతలను అరెస్ట్(BJP Leaders Arrested)​ చేశారు. పోలీసుల తోపులాటలో భాజపా కార్యకర్త స్పృహతప్పి పడిపోయారు. ముట్టడికి యత్నించిన భాజపా నేతలను అరెస్ట్​ చేశారు. ఢిల్లీలో లిక్కర్ టెండర్లలో కవిత అవినీతికి పాల్పడిందని గౌతమ్‌ రావు(GauthamRao) ఆరోపించారు.లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో భాజపా నగర కార్యకర్తలు ఆమె ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. ఒక్కసారిగా భాజపా కార్యకర్తలు దూసుకురావడంతో పోలీసులు అడ్డుకున్నారు. భాజపా కార్యకర్తలను తిప్పికొట్టేందుకు తెరాస కార్యకర్తలు(TRS Leaders) కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పోలీసులకు భాజపా కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది.

Exit mobile version