end
=
Saturday, November 23, 2024
వార్తలుజాతీయంPM MODI:ఉగ్రవాదమే కాంగ్రెస్ ఓటు బ్యాంక్
- Advertisment -

PM MODI:ఉగ్రవాదమే కాంగ్రెస్ ఓటు బ్యాంక్

- Advertisment -
- Advertisment -

  • ప్రతిపక్ష పార్టీపై ప్రధానమంత్రి విమర్శలు
  • ఉగ్రవాద నిర్మూలనకు బీజేపీ పనిచేస్తోంది: మోదీ


భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Indian Prime Minister Narendra Modi) ప్రతిపక్ష కాంగ్రెస్ (Congress) పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఉగ్రవాదాన్నే కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌ (Congress vote bank is terrorism)గా పరిగణిస్తుందని దుయ్యబట్టారు. సర్జికల్ స్ట్రైక్స్‌ (Surgical strikes)పై ప్రశ్నలు లేవనెత్తడమే దీనిని నిరూపిస్తుందని అన్నారు. ఆదివారం రెండు రోజుల గుజరాత్ (Gujarat) పర్యటనలో భాగంగా ఖేడాలో ఆయన ప్రసంగించారు. ‘గుజరాత్ ఎంతో కాలంగా ఉగ్రవాదానికి లక్ష్యంగా ఉంది. సూరత్, అహ్మదాబాద్ (Surat, Ahmedabad) పేలుళ్లలో అనేకమంది గుజరాతీలు మరణించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాదం తీవ్రంగా ఉంది’ అని విమర్శించారు.

2014లో ప్రజల ఓటు దేశంలో ఉగ్రవాదాన్ని నియంత్రిచడంలో చాలా తేడాను తీసుకొచ్చిందని చెప్పారు. మన సరిహద్దుల్లో దాడులు చేసేందుకు ఉగ్రవాదులు కూడా ప్రస్తుతం ఆలోచిస్తున్నారని చెప్పారు. బట్లా హౌజ్ ఎన్‌కౌంటర్లో (Batla House encounter) కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీలకు ఉగ్రవాదులకు మద్దతుగా మాట్లాడాయని ఆరోపించారు. కాంగ్రెస్ ఉగ్రవాదాన్ని లక్ష్యాన్ని చేసుకోవాలని మేము కోరితే, తిరిగి తమనే లక్ష్యంగా చేసుకుందని అన్నారు. దేశంలో ఉగ్రవాద నిర్మూలనకు బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం (Double Engine Govt) తోనే అది సాధ్యమని చెప్పారు.

మరోవైపు సోమవారం ఐదు ప్రాంతాల్లో నిర్వహించే ర్యాలీల్లో ప్రధాని ప్రసంగించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాజ్‌కోట్ (Rajkot) జిల్లాలో అన్ని సీట్లు గెలుస్తామని, ప్రధాని మోడీ మళ్లీ ప్రచారానికి వచ్చి పెద్ద ఎత్తున జనాలను పోగు చేస్తారని బీజేపీ నేత కమలేష్ మిరానీ (BJP leader Kamlesh Mirani) అన్నారు. ప్రధాని మోడీకి రాజ్‌కోట్‌తో మంచి అనుబంధం ఉందని, ఆయన తొలిసారిగా ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేశారని గుర్తుచేశారు. వచ్చే నెల 1, 5వ తేదీల్లో రెండు దశల్లో గుజరాత్‌లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రధాని 8 ర్యాలీల్లో ప్రసంగించారు. అయితే క్రితం సారితో పోలిస్తే ప్రధాని ర్యాలీల సంఖ్య తగ్గడం గమనార్హం.

(Hyderabad:హైదరాబాద్ నగర వాసులకు గుడ్‌ న్యూస్‌)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -