end
=
Friday, November 22, 2024
వార్తలుఅంతర్జాతీయంఒక్కరోజులోనే రూ. 64 వేల కోట్లు లాస్!
- Advertisment -

ఒక్కరోజులోనే రూ. 64 వేల కోట్లు లాస్!

- Advertisment -
- Advertisment -

భారీ సంపదను కోల్పోయిన టెస్లా అధినేత ఎలన్ మస్క్

Elon Musk: టెస్లా అధినేత ఎలన్ మస్క్‌(Elon Musk is the head of Tesla)కు ఊహించని షాక్ తగిలింది. ఒకటి రెండు కాదు ఏకంగా వేల కోట్ల రూపాయలు నష్టపోయాడు. మైక్రోబ్లాగింగ్ సైట్ (microblogging site) ట్విట్టర్‌ (Twitter)ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి కష్టాలను ఎదుర్కొంటున్నా ఆయన.. ఇటీవలే ప్రపంచ అత్యంత ధనవంతుడి స్థానం నుంచి కిందకు జారింగ మస్క్, తాజాగా భారీ సంపదను కోల్పోయారు. టెస్లా షేర్లలో భారీ అమ్మకాల కారణంగా ఎలన్ మస్క్ సంపద ఒక్కరోజులో ఏకంగా రూ. 63.83 కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో ఎలన్ మస్క్ సంపద రెండేళ్ల కనిష్టానికి పడిపోయి, 147.7 బిలియన్ డాలర్లకు చేరింది. అంతేకాకుండా గడిచిన ఏడాది కాలంలో ప్రపంచ రెండో కుబేరుడి సంపద 123 బిలియన్ డాలర్లకు పైగా కరిగిపోవడం గమనార్హం. ట్విట్టర్‌ను కొన్నప్పటి నుంచి టెస్లా కంపెనీని నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆందోళనలు వాటాదారుల్లో పెరిగింది. దీనికి తోడు బ్రోకరేజ్ సంస్థలు (Brokerage firms) సైతం ప్రతికూల అభిప్రాయాలు చేస్తుండటంతో టెస్లా షేర్ ధర 6 శాతం మేర పడిపోయింది.

ఈ నేపథ్యంలోనే ఎలన్ మస్క్ సంపద పెరిగినంత వేగంగా తరిగిపోతోంది. మరోవైపు, ట్విట్టర్ సీఈఓ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించే వేరెవరికైనా అప్పగించి తాను ఆ పదవికి రాజీనామా చేస్తానని ఎలన్ మస్క్ ప్రకటించాడు. ఈ మధ్యే ట్విట్టర్ బాధ్యతల గురించి పోల్ నిర్వహించగా, ఎక్కువ మంది వద్దని సమాధానమివ్వడంతో, ఎలన్ మస్క్ ట్విట్టర్ సీఈఓగా ఉండేందుకు మంచి మూర్ఖుడు దొరికాక తప్పుకుంటానని వ్యంగ్యంగా చెప్పడం గమనార్హం. ఆ తర్వాత తాను ట్విట్టర్ సాఫ్ట్‌వేర్, సర్వర్ టీమ్‌ (Software and Server Team)లో ఉంటానని పేర్కొన్నారు.

ఇదిలావుంటే.. ఈ నెలలో 37లక్షల భారత అకౌంట్లపై వాట్సప్ నిషేధం (WhatsApp ban on accounts) విధించింది. ఇన్‌స్టంట్ మిస్సేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సప్ (Instant messaging platform WhatsApp)ఈ నెలలో 37లక్షల భారత అకౌంట్‌లపై నిషేధం విధించింది. ఇది అక్టోబర్ నెలతో పోలిస్తే 60శాతం ఎక్కువని వాట్సప్ ప్రతినిధి వెల్లడించారు. నవంబర్ 1 నుంచి ఇప్పటివరకు మొత్తం 37.16లక్షల వాట్సప్ అకౌంట్లను నిషేధించగా, వీటిలో 9,90,000 ఖాతాలను వినియోగదారుల నుంచి ఎలాంటి నివేదికలు రాకముందే ముందస్తుగా బ్యాన్ చేశామని తెలిపారు. గత నెలలో మొత్తం 23.24లక్షల ఖాతాలపై వేటేసినట్టు నెలవారీ నివేదికలో వాట్సప్ వెల్లడించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యస్థ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్ (Information Technology rules) 2021లోని రూల్ 4(1)(డి) ప్రకారం ఈ అకౌంట్లు నిషేధించబడ్డాయని తెలిపింది. సంస్థ పాలసీలు, గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘిస్తూ, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ధృవీకరించని సందేశాలను ఫార్వార్డ్ చేయడం వంటి చర్యలకు పాల్పడితే వాట్సప్ ఖాతాలను నిషేధిస్తామని తెలిపింది. ఇందుకు సంబంధించిన నెలవారీ నివేదికను నిబంధనల ప్రకారం, ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -