జూన్ 15 నుంచి 30 మధ్య పరీక్షలు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్(Tet notification)ను పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. డిటైల్డ్ నోటిఫికేషన్‌ను ఈనెల 15న విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లో మూడో సారి(Third time) టెట్ నోటిఫికేషన్ ఇవ్వటం విశేషం. గతేడాది మే 20 నుంచి జూన్ 2 వరకు తొలిసారి టెట్ పరీక్షను నిర్వహించగా, రెండోసారి ఈ ఏడాది జనవరి 2 నుంచి 20 వరకు నిర్వహించారు. తాజాగా మూడోసారి జూన్ 15 నుంచి 30 మధ్య నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రెండు సార్లు టెట్‌ను నిర్వహిస్తామని ప్రకటించినట్లుగానే ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈనెల 15 నుంచి ఫీజును చెల్లించి ఆన్‌లైన్‌లో ఈనెల 30 వరకు రఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 9 నుంచి హాల్‌టికెట్లను జారీ చేయనున్నారు. జూన్ 15 నుంచి 30వ తేదీ మధ్యలో టెట్ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్టు నోటిఫికేషన్‌లో పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి.నర్సింహారెడ్డి తెలిపారు. ఫలితాలను జూలై 22న వెల్లడించనున్నట్లు ప్రకటించారు. టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ(Waitage) ఉండనుంది. రెండు సెషన్లలో టెట్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం సెషన్ 9 గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం సెషన్ 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు ఉండనుంది. పేపర్ పేపర్ టెట్ పరీక్షను నిర్వహిస్తారు. ఒకటి నుంచి 5వ తరగతి వరకు బోధించే అభ్యర్థులు పేపర్ 6 నుంచి 8 వరకు పేపర్ పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు కలిపి రూ.వెయ్యిగా ఖరారు చేశారు. ఇంటర్ తర్వాత డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తిచేసిన వారు పేపర్ డిగ్రీ బీఎడ్ చేసిన వారు పేపర్ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
జాబ్ క్యాలెండర్ ప్రకారమే….
కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించినట్లుగానే టెట్ నోటిఫికేషన్‌ను వేసింది. ఏప్రిల్‌లో టెట్ అని జాబ్ క్యాలెండర్ ప్రటించిన దానికనుగుణంగానే నోటిపికేషన్ జారీ చేసింది. అలాగే ఫిబ్రవరిలో డీఎస్సీని నిర్వహిస్తామని జాబ్‌క్యాలెండర్(Job calendar)లో వెల్లడించడంతో అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ చివరి దశలో ఉన్నందున త్వరగా డీఎస్సీపై నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన 6 వేల టీచర్ పోస్టులకే పరిమితం కాకుండా ప్రమోషన్స, పదవి విరమణ ఖాళీలు కూడా జత చేసి మొత్తం 10 వేల ఖాళీలతో నోటిఫికేషన్ జారీ చేయాలని కోరుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం టెట్ నోటిఫికేషన్ వేయడంతో ఇది పూర్తయ్యాక లేదా ఎప్పుడైనా డీఎస్సీ నోటిఫికేషన్ వేసే అవకాశం ఉంది. గతంలోనూ డీఎస్సీకు ముందు టెట్ నిర్వహించారు.