end

Thamilnadu: మట్టి టీ గ్లాసులతో ప్రధాని ముఖ చిత్రం..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు (సెప్టెంబర్‌17) పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ప్రధాని మోదీకి నేటితో 72 ఏళ్లు. దేశవ్యాప్తంగా ప్రధాని జన్మదిన వేడుకల(Birthday Celebrations)ను ఈసారి భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. బి‌జే‌పి నాయకులు పండగ వాతావరణం ని తలపిస్తున్నారు.ఆజాదీకా అమృత్ మహొత్సవాలు జరుగుతున్న సమయంలో మోదీ జన్మదినం కూడా అంతే ఘనంగా చేయాలని బీజేపీ నిర్ణయించింది. తమిళనాడు బీజేపీ (Tamilnadu BJP)ప్లాన్ చేసింది. మోడి మీద ఉన్న ప్రేమతో ఢిల్లీలో ఓ రెస్టారెంట్ అద్భుతమైన ఆఫర్ ఒకటి పెట్టింది. పది రోజుల పాటు 56 అంగుళాల థాలీని అందించనుంది.

 ఈ రోజు పుట్టిన పిల్లలు అదృష్టం గా భావించాలి ఎందుకు అంటే ఈ రోజు పుట్టిన పిల్లలకు బంగారు ఉంగరాలను (Gold Rings) కానుకగా ఇవ్వాలని నిర్ణయించింది. చెన్నై రొయాపురంలోని ఆర్ఎస్ఆర్ఎం ఆస్పత్రి(RSRM Hospital)లో లబ్దిదారులకు బంగార ఉంగరంతో పాటు దీంతో పాటు బేబీ కిట్‌లను వారికి అందజేయనున్నారు. బేబీ కిట్‌లను కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ అందజేస్తారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్(CM Stalin) ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గం కొలతూరులో 750 కిలోల చేపలను పంపిణీ చేయనున్నారు. కాంచీపురంలో రక్తదాన శిబిరానికి కేంద్ర మంత్రి హాజరవుతారు. అనంతరం దేశవ్యాప్త రక్తదాన కార్యక్రమం రక్తదాన అమృతమహొత్సవాన్ని అవడిలో జరిపిస్తున్నారు.

ఎవరికి నచ్చినట్టు మోడి మీద ఉన్న అభిమాననీ చాటుతున్నారు. అలాగే ఒక ఛాయ్‌వాలా మట్టి టీగ్లాసుల(Clay Tea Glasses)తో  ప్రధాని సైకత శిల్పం తీర్చిదిద్ది తన అభిమానాన్ని చాటుకున్నారు. నాకళ ద్వారా మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రస్తుతం ఈ సైకత శిల్పం ఫొటో నెట్టింట్లో ట్రెండ్ అవుతుంది. సుదర్శన్‌ పట్నాయక్‌ సైకత ప్రతిభను మెచ్చుకుంటూ చాలామంది ప్రశంసలు కురిపిస్తు అతన్ని పొగుడుతున్నారు.

Exit mobile version