end
=
Saturday, January 18, 2025
సినీమాథ్యాంక్ యూ అంటూ వచ్చేసిన నాగచైతన్య….
- Advertisment -

థ్యాంక్ యూ అంటూ వచ్చేసిన నాగచైతన్య….

- Advertisment -
- Advertisment -

థ్యాంక్ యూ మూవీతో అలరించేందుకు అక్కినేని నాగచైతన్య ఈ రోజు థియేటర్స్ ముందుకు వచ్చాడు. రాశిఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించింది. అవికా గోర్, మాళ‌వికా నాయ‌ర్ ముఖ్యపాత్రల్లో కనిపించారు. బీవీఎస్ ర‌వి క‌థ‌ను అందించారు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలే ఉన్నాయి. త‌మ‌న్ మ్యూజిక్ అందించాడు. దిల్‌రాజు ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్యవ‌హరించాడు. క‌రోనా కార‌ణంగా చాలాకాలంగా వాయిదాప‌డుతూ వ‌స్తున్న ఈ సినిమా మొత్తానికి నేడు ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. మ‌రి ఇప్పుడు మూవీ ఎలా ఉంది స్టోరీ ఎంటో తెలుసుకుందాం.

లవ్ స్టోరీ, బంగర్రాజు వంటి సూపర్ హిట్ సినిమాల తరువాత అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం థ్యాంక్ యూ. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానిగా చైతూ కనిపిస్తాడు. మూడు వేరు వేరు కోణాల్లో సాగే క్యారెక్టర్‌లో యాక్ట్ చేసినట్లు తెలుస్తోంది. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా థ్యాంక్ యూ మూవీని రూపొందించినట్లు అర్థమవుతోంది. బ్యూటీఫుల్ ఫీల్ గుడ్ మూవీ అని ఆడియన్స్ అంటున్నారు. ఫస్ట్‌హాఫ్ హార్ట్ టచింగ్‌గా సాగుతుంది. మ్యాజికల్ మూమెంట్స్ చాలా ఉన్నాయంటున్నారు. మూడు వయసుల్లో సాగే పాత్రలో నాగ చైతన్య యాక్టింగ్ ఇరగదీసినట్లు తెలుస్తోంది. చైతూ లుక్ కూడా చాలా కొత్తగా ఉందని కెరీర్‌లో ది బెస్ట్ సినిమాగా నిలిచిపోతుందని టాక్ వస్తోంది. నాగ‌చైత‌న్య మూడు పాత్రల్లో.. ప‌దహారేళ్ల కుర్రాడిలా, 21 ఏళ్ల యువ‌కుడిలా, 36 ఏళ్ల వ్యక్తిగా క‌న‌బ‌డిన విధానం చూడటానికి చాలా బాగుంది. కనులా పండగా ల ఉంది. ఈ రోజుల్లో మ‌నంద‌రం జీవితాల్లో వేగంగా ప‌రిగెడుతూ గ్రాట్యిట్యూడ్‌ను చూపించ‌డం మ‌రిచిపోతున్నాం. అది తెలియ‌జేయాల‌నే ముఖ్య ఉద్దేశం.

క‌థేంటంటే..

అభిరామ్(నాగ‌చైత‌న్య) జీవితంలో చాలా క‌ష్టాల‌ను చవిచూసి అమెరికా వెళ్లి ఒక యాప్ త‌యారు చేసి చాలా పాపులర్ బిజినెస్‌మ్యాన్‌గా ఎదుగుతాడు. అయితే ఆయ‌న విజ‌యం సాధించ‌డంలో తోడ్పాటు అందించిన వ్యక్తుల‌ను మ‌రిచిపోతాడు. అందులో ప్రియ(రాశిఖ‌న్నా) కూడా ఒక‌రు. ఒక స‌మ‌యంలో ఆ విష‌యాన్ని అర్థం చేసుక్నా అభిరామ్ త‌న స‌క్సెస్‌ఫుల్ జ‌ర్నీలో భాగ‌మైన స్నేహితులంద‌రినీ క‌లిసి కృతజ్ఞతను తెలియ‌జేయాల‌నుకుంటాడు. ఆ ప్రయాణంలో అభిరామ్‌కు ఎదుర‌య్యే అనుభ‌వాలే జ్ఞాపకాలే థ్యాంక్యూ స్టోరీ.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -