గురువారం మెగాబ్రదర్ నాగబాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా నాగబాబు అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా తన తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. విధేయుడు, ఎమోషనల్ పర్సన్, మంచి హృదయమున్న వ్యక్తే కాదు.. చాలా సరదాగా ఉండే వ్యక్తి, నా సోదరుడు నాగబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మన బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని, నీ ప్రతి పుట్టినరోజుకి అది మరింత బలపడాలని ఆశిస్తున్నాను. అని ట్వీట్ చేశారు. మెసేజ్‌తో పాటు చిరంజీవి, నాగబాబు, పవన్‌కల్యాణ్ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.
ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్: ప్రధాని
దీనికి నాగబాబు కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు. థాంక్స్ అన్నయ్య.. నేనెప్పుడూ నీతోడై ఉంటాను అని అన్నారు. కాగా, నాగబాబుకు తన కుటుంబ సభ్యులతో పాటు.. సినీ హీరో, తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, నటుడు, నిర్మాత బండ్లగణేశ్, సినీప్రముఖులు, జబర్దస్త్ టీం, అదిరింది టీం వారు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.