end
=
Monday, January 20, 2025
వార్తలుజాతీయంసీఎం జగన్‌మోహన్‌‌ రెడ్డికి ధన్యవాదాలు
- Advertisment -

సీఎం జగన్‌మోహన్‌‌ రెడ్డికి ధన్యవాదాలు

- Advertisment -
- Advertisment -
  • జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

అమరావతి: దివీస్ కర్మాగారంతో పరిసర గ్రామాల్లోని గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారని.. వారి సమస్యలను సీఎం జగన్ వెంటనే పరిష్కరించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్ చేశారు. ఆదివారం పవన్‌ మీడియాతో మాట్లాడుతూ.. దివీస్ నిరసనకారులను ప్రభుత్వం విడుదల చేయడం సంతోషం కలిగించిందన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు, సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దివీస్ కర్మాగారం విడుదల చేసే కాలుష్యంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారన్నారని కల్యాణ్ వాపోయారు. 36 మందిని అరెస్టు చేసి జైలులో పెట్టడంతో గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయన్నారు. వారికి బెయిలు రావడానికి సహకరించిన అందరికీ జనసేన తరపున పవన్‌ కృతజ్ఞతలు చెప్పారు. ఇదే విజ్ఞతతో వారిపై పెట్టిన కేసులు పూర్తిగా ఎత్తివేయాలని, వారికి న్యాయం చేయాలని పవన్‌ కల్యాణ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -