end
=
Friday, November 22, 2024
వార్తలురాష్ట్రీయంసీఎంకు కృతజ్ఞతలు: మంత్రి సత్యవతి రాథోడ్‌
- Advertisment -

సీఎంకు కృతజ్ఞతలు: మంత్రి సత్యవతి రాథోడ్‌

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రానికి ఎస్టీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ లా కాలేజీ మంజూరయింది. కాలేజీకి బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతిచ్చింది. కాలేజీ మంజూరు పత్రాలను అధికారులు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు అందించారు. 60 సీట్లతో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ లా కోర్సు కాలేజీ సీట్లు రెండో విడతలో అందుబాటులోకి రానున్నాయి. ఇందులో ఎస్టీలకు 39 సీట్లు, ఎస్సీలకు 6 సీట్లు, బీసీలకు 7 సీట్లు కెటాయించనున్నారు. కాగా, రాష్ట్రానికి ఎస్టీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ లా కాలేజ్‌ రావడానికి విశేష కృషి చేసిన సీఎం కేసీఆర్‌కు మంత్రి సత్యవతి రాథోడ్‌ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదివేలా సీఎం చూపిస్తున్న కృషి వెలకట్టలేనిదని మంత్రి వెల్లడించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -