బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా(Siddharth Malhotra) తనలో హీరో మాత్రమే కాదు ఫిల్మ్ మేకర్(Film Maker) కూడా ఉన్నాడంటున్నాడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్లు పూర్తవుతుందన్న ఆయన.. కొంతకాలంగా సినిమాలు తీయాలని అనుకుంటున్నట్లు ప్రముఖులతో చర్చించినట్లు తెలిపాడు. ఇక ఈ పదేళ్ల కాలంలో గొప్ప పెర్ఫార్మర్(Performer)గా ఎదగడంతోపాటు నిర్మాణ అంశాలపై కూడా పట్టు సాధించినట్లు వెల్లడించిన సిద్ధార్థ్.. మనుషుల వ్యక్తిత్వాన్ని లేదా దృక్కోణాలను తన ఫిల్మ్ మేకింగ్(Film making) భాషలో మెరుగ్గా చెప్పగలనన్నాడు. ఎందుకంటే కొన్ని సినిమాలు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభశం తన సృజనాత్మకతను బయటకు తీస్తుందనే నమ్మకం ఉందన్నాడు.
అలాగే ఏ నటీనటులకైనా తమ సన్నివేశాలు లేదా చిత్రాలను ప్రజలు ఎల్లకాలం గుర్తించుకున్నపుడే కలిసినపుడు అప్యాయంగా పలకరిస్తారన్నాడు. తాను కూడా పబ్లిక్‌లో తిరుగుతున్నపుడు ‘హసీ తో ఫేసీ’ లేదా ‘కపూర్ అండ్ సన్స్(Kapoor and Sons)’కు సంబంధించిన సన్నివేశాలను గుర్తుచేస్తూ మురిపిస్తారని చెప్పాడు. ‘మా జీవితానికి అదే నిజమైన సంపద. వ్యాపార అంశం ఎలా ఉన్నప్పటికీ ఆదరించే సంఖ్య స్పష్టంగా ఉంచుకోవడం అనేది ఏ నటుడికైనా నిజమైన పరీక్ష’ అంటూ తన ఫీలింగ్స్(Feelings) బయటపెట్టాడు.
https://www.instagram.com/p/ClOVH3ENGnW/?utm_source=ig_web_copy_link