end

అందుకే కాంగ్రెస్‌ ఓడిపోతోంది..

న్యూఢిల్లీ: కొన్ని శతాబ్దాల పాటు దేశాన్ని, దాదాపు అన్ని రాష్ర్టాలను పాలించిన ఏకైక పార్టీ కాంగ్రెస్‌. ఇటీవల ఆ పార్టీ రాన్రాను అన్ని కేంద్రంతో పాటు మిగితా రాష్ట్రాల్లో పట్టు కోల్పోతోంది. ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ఓడిపోవడం.. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ జరిగిన అన్ని ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ ఓడిపోయింది. దాదాపు 60ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా దేశాన్ని నడిపించిన పార్టీ ఇప్పుడు అత్యంత దీనావస్థలోకి చేరుకుంది. అనేక చోట్ల డిపాజిట్లు కూడా దక్కడం లేదంటే ఇక ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం ఏంటి..? నిన్న, మొన్నటివరకు మేటి నాయకులుగా, ప్రజా నేతలుగా కీర్తించడబడిన రాజకీయ దురంధరులు, ఇప్పుడు దేనికీ పనికిరాకుండా పోతున్నారెందుకు..? ఇలాంటి ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సమాధానమిచ్చారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆజాద్.. ఓటములతో తమ పార్టీ ఘోర పరాజయాలకు గల కారణాలను వివరించారు. ‘పరాజయాలతో మా పార్టీ ఆందోళన చెందుతోందనడం వాస్తవం. ముఖ్యంగా బిహార్ ఎన్నికలు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఓటమి పార్టీని తీవ్రంగా కలవరపెడుతోంది. దీనికి కారణం పార్టీ అధిష్ఠానం మాత్రం కాదు. లీడర్‌షిప్ అద్భుతంగా ఉంది. అందుకే నేను నాయకత్వాన్ని నిందించను. పార్టీని ప్రేమించి, పార్టీ కోసం శ్రమించేవారు కరువవ్వడం వల్లే పార్టీ బలహీనపడిందని నా భావన. దీనికి తోడు పోటీలో నిలబడే నేతలకు, కింది స్థాయి నాయకులకు మధ్య సంబంధాలు దెబ్బతినడం కూడా మా ఓటమికి కారణమంటున్నారు గులాం నబీ ఆజాద్.

Exit mobile version