end
=
Sunday, January 19, 2025
సినీమాఆ సినిమా బలవంతంగా చేశా..
- Advertisment -

ఆ సినిమా బలవంతంగా చేశా..

- Advertisment -
- Advertisment -

‘అష్టాచమ్మా’ సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించాడు నేచురల్ స్టార్ నాని. ఆ తర్వాత మరో హీరో తనీష్‌తో కలిసి ‘రైడ్’ సినిమా చేశాడు. బెల్లం కొండ సురేష్ నిర్మించిన ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమాలో నిర్మాత బలవంతం వల్లే నటించానని తాజాగా నాని వెల్లడించాడు. బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అల్లుడు అదుర్స్’ సినిమా ట్రైలర్‌ని నాని విడుదల చేశాడు.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. గతంలో ఒకసారి బెల్లంకొండ సురేష్ నా మాట వినలేదు. ‘రైడ్’ సినిమా చేయనని చెప్పడానికి ఆయన ఆఫీస్‌కు వెళ్లాను. ఆయన నా మాట వినకుండా బలవంతంగా ఆ సినిమా చేయించారు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. నాకు కూడా ఆ సినిమా బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు ‘అల్లుడు అదుర్స్’ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయమని అడిగారు. ప్రసాద్ ల్యాబ్స్‌లో షూటింగులో ఉంటానని చెప్పాను. అయినా నా మాట వినకుండా ఇక్కడే ఈవెంట్ పెట్టి నాతో ట్రైలర్ రిలీజ్ చేయించారు. ట్రైలర్ చూసిన తర్వాత ఇది కూడా కలిసి వస్తుందని నాని పేర్కొన్నాడు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -