end
=
Thursday, November 21, 2024
రాజకీయంఆ పార్టీలకు ఓటు అడిగే నైతిక హక్కే్ లేదు
- Advertisment -

ఆ పార్టీలకు ఓటు అడిగే నైతిక హక్కే్ లేదు

- Advertisment -
- Advertisment -

దుబ్బాక :దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని ముంగాజిపల్లి ఎస్సీకాలనీ, అంకిరెడ్డిపల్లి, రాంసాగర్ గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత ప్రచారం చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గంలోని ఏ గ్రామంలోనైనా ఆపద వస్తే.. వారికి అన్ని విధాలుగాఅండగా ఉంటూ, ఆర్థిక సహాయం అందించిన మంచి మనసున్న వ్యక్తి సోలిపేట రామలింగారెడ్డి.

ఇవాళ ఆయన మనమధ్య లేకపోయినప్పటికీ.. ఆయన ఆశయాలు నెరవేర్చేందుకు ఆయన సతీమణిగా నేను మీకు అండగా ఉంటానని ఈసందర్భంగా హామీ ఇస్తున్నానన్నారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఆమె తెలిపారు.టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందో అందరికీ తెలుసన్నఆమె.. కారు గుర్తుకు ఓటు వేసి, భారీ మెజార్టీతో గెలిపించగలరని ఈ సందర్భంగా ఓటర్లకు విన్నవించారు. అభివృద్ధినిచూసి ఓర్వలేని కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు కనీసం ఓటు అడిగే నైతిక హక్కు లేదని ఈ సందర్భంగా ఆమె విమర్శించారు.

తృటిలో తప్పిన 40 మంది ప్రయాణికుల ప్రాణాలు..

ఈ కార్యక్రమంలో పద్మా దేవేందర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, జహీరాబాద్ ఎమ్మెల్యేమాణిక్యరావు, జడ్పీటీసీ లింగాయపల్లి యాదగిరి, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ, రైతు సమన్వయ సమితిఅధ్యక్షులు, ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పటాన్‌చెరులో దారుణ హత్య

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -