end
=
Wednesday, July 3, 2024
సినీమాతారక్ కెరీర్ లో 30వ సినిమా
- Advertisment -

తారక్ కెరీర్ లో 30వ సినిమా

- Advertisment -
- Advertisment -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే అభిమానులు పండగ చేసుకుంటారు. ఆయన కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా సూపర్ హిట్ కొట్టిన తారక్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. తారక్ కెరీర్ లో 30వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించి ఈ సినిమా నుంచి ఓ చిన్న వీడియోను రిలీజ్ చేశారు. ఓ పవర్ ఫుల్ డైలాగ్ తో విడుదలైన ఆ వీడియో ఎన్టీఆర్ అభిమానులను చాలాబాగా ఆకట్టుకుంది. దాంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయేలా చేసింది.

ఈ సినిమా గురించి క్రేజీ ఆప్డేట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఈ నెల 26వ తేదీన తారక్ కొరటాల కాంబో మూవీ పూజా కార్యక్రమాలు మొదలవుతాయని తెలుస్తోంది. పూజా కార్యక్రమాలు పూర్తైన వెంటనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. ఇటీవల కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య సినిమా కి హిట్ టాక్ రాలేదు. దాంతో తారక్ సినిమాతో ఎలాగైనా మరోసారి తనుంటో నిరూపించుకోవాలని కసిగా ఉన్నారు కొరటాల. తారక్ కూడా రాజమౌళి మూవీ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలని చూస్తున్నారు. మరి తారక్ సినిమాతో కొరటాల తిరిగి ఫామ్ లోకి వస్తారేమో చూడాలి. ఈ సినిమా తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా, బుచ్చిబాబు డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -