end
=
Saturday, January 18, 2025
సినీమాWeb Series: ATM సిరీస్ మిమ్మల్ని టెన్షన్ పెడుతూనే న‌వ్విస్తుంది
- Advertisment -

Web Series: ATM సిరీస్ మిమ్మల్ని టెన్షన్ పెడుతూనే న‌వ్విస్తుంది

- Advertisment -
- Advertisment -
  • ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత దిల్ రాజు
  • జ‌న‌వ‌రి 20న జీ 5లో రాబోతున్న చిత్రం

టాలీవుడ్‌(Tollywood)లో స్టార్ ఫిల్మ్ డైర‌క్టర్ హ‌రీష్‌శంక‌ర్‌(Director Harish Shankar)కి సెపరేట్ గుర్తింపు ఉంది. సినిమాల‌ను డైరెక్ట్ చేయ‌టంతో పాటు ఆయ‌న త‌న రూట్‌ను మార్చారు. కొత్త టాలెంట్‌(New Talent)ను ఎంక‌రేజ్ చేయ‌టానికి సిద్ధమ‌య్యారు. అందులో భాగంగా ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5తో క‌లిశారు హ‌రీష్ శంక‌ర్‌. ఆయ‌న‌కు స‌పోర్ట్‌గా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు కూడా జాయిన్ అయ్యారు. వీరిద్దరూ క‌లిసి ఏటీఎం అనే వెబ్ సీరీస్‌(Web Series)ని రూపొందించారు. బిగ్ బాస్ విన్నర్ వీజే స‌న్నీ, కృష్ణ, ర‌విరాజ్‌, రాయ‌ల్ శ్రీ, దివి త‌దిత‌రులు కీల‌క పాత్రల్లో న‌టించిన ఈ సినిమాకు సి.చంద్రమోహ‌న్ ద‌ర్శక‌త్వం వ‌హించారు. జనవరి 20న ఈ వెబ్ సిరీస్ ప్రీమియర్ అవుతుంది. ఈ సందర్బంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు మేకర్స్.

ఈ సందర్భంగా హ‌రీష్ శంక‌ర్ మాట్లాడుతూ.. ‘కొత్తగా కథలను చెప్పటానికి ఓటీటీ ఫ్లాట్ ఫామ్(OTT Platform) బావుంటుంద‌ని ఆలోచన వ‌చ్చింది. అప్పుడు జీ 5(ZEE 5) టీమ్‌తో క‌లిశాను. నేను, రాజుగారు, జీ 5 టీమ్‌, ఈ క‌థ‌ను నేను రాశాను. కానీ.. డైరెక్టర్‌గా నాకంటే చంద్ర మోహ‌న్ బాగా తీశాడ‌నిపించింది. అంత బాగా తీశాడు. పోస్ట్ ప్రొడ‌క్షన్(POst Production) టైమ్‌లో సినిమా చూశాను. చంద్రలో మంచి కామెడీ టైమింగ్ ఉంది. త‌ను సుబ్బరాజుగారికి క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన తీరు చాలా బావుంది. రెండున్నర గంట‌ల కంటెంట్‌ను తీయ‌టానికి మాకు వంద రోజులు ప‌డుతుంది. అలాంటిది నాలుగున్నర గంట‌ల కంటెంట్‌(Content)ను తీయ‌టానికి 50 రోజులే తీసుకున్నారంటే చాలా గ్రేట్. ఇదే బిగ్గెస్ట్ స‌క్సెస్‌. హ‌ర్షిత్, హ‌న్షిత‌ల‌కు థాంక్స్‌. సుబ్బరాజ్‌, స‌న్ని, దివిల‌కు థాంక్స్‌. కంటెంట్‌ను ప్యూర్‌గా చెప్పొచ్చు అనే ప్యాష‌న్‌తో ఓటీటీల్లోకి వ‌చ్చాం. దానికి స‌పోర్ట్ చేసిన జీ5కి థాంక్స్‌. సినిమా అనేది శాశ్వతం’ అన్నారు.

దిల్ రాజు(Dil Raju) మాట్లాడుతూ.. ‘జీ 5కి కంగ్రాట్యులేషన్స్. మాతో ఓ వెబ్ సిరీస్ చేయించారు. 25 ఏళ్లు డిస్ట్రిబ్యూట‌ర్‌గా, 20 ఏళ్లు నిర్మాత‌గా ఉన్నాను. హ‌రీష్ శంక‌ర్ వెబ్ సిరీస్ చేద్దామ‌ని నాతో చెప్పిప్పుడు ఇప్పుడు వెబ్ సిరీస్‌లేంటి అన్నాను. కానీ ముందు త‌ను క‌థ విన‌మంటే విన్నాను. న‌చ్చింది. మా ఫ్యామిలీ నుంచి మా అబ్బాయి హ‌ర్షిత్‌, అమ్మాయి హ‌న్షితల‌ను నిర్మాత‌లుగా మార్చి ఈ వెబ్ సిరీస్ చేయించాం. ట్రైల‌ర్ చూడ‌గానే సినిమా ట్రైల‌ర్‌గానే అనిపించింది. చంద్ర మోహ‌న్ కంటెంట్‌ను హ్యాండిల్ చేసిన తీరు న‌చ్చింది. సుబ్బరాజ్‌, స‌న్నికి థాంక్స్‌. దిల్‌రాజు ప్రొడ‌క్షన్స్ ద్వారా న్యూ టాలెంట్‌ను తీసుకు రావాల‌నే మా ల‌క్ష్యం. టెన్షన్ ప‌డుతూనే సిరీస్‌ను ఎంజాయ్ చేస్తారు. జ‌న‌వ‌రి 20న ఈ సిరీస్ ఆడియెన్స్(Audience) ముందుకురానుంది’ అన్నారు.

దర్శకుడు సి.చంద్ర మోహన్ మాట్లాడుతూ ‘ఈ వెబ్ సిరీస్‌ని రాజుగారితో చేయాల‌నుకుని హ‌రీష్‌గారి స‌పోర్ట్‌తో క‌లిశాను. ఆయ‌న మొత్తం క‌థ ఒకేసారి విన‌లేదు. నేను వెబ్ సిరీస్ ఎప్పుడూ చేయ‌లేదు. ఒక్కొక్క ఎపిసోడ్(Episode) వింటాను అని రోజూ ఉద‌యం పిలిచేవారు. నేను వెళ్లి క‌థ చెప్పేవాడిని. మొత్తం క‌థ న‌చ్చటంత ఆయ‌న ఓకే చెప్పారు. మా నిర్మాత‌లు హ‌ర్షిత్‌, హ‌న్షిత‌ల‌కు థాంక్స్‌. సుబ్బరాజ్‌గారు చేసిన స‌పోర్ట్ కార‌ణంగానే ఆ క్యారెక్టర్ అంత గొప్పగా వ‌చ్చింది. అలాగే గ‌జేంద్ర పాత్రలో చేసిన పృథ్వీ, ష‌ఫీ, సన్ని, రాయల్‌, కృష్ణ, ర‌వి.. ఎవ‌రికి వాళ్లు న‌టిస్తూ వ‌చ్చారు. మంచి టీమ్ దొరికినందుకు హ్యాపీగా ఉంది. టాప్ టెక్నీషియ‌న్స్(Technician) కుదిరారు. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌’ చెప్పారు.

దర్శకుడు క్రిష్(Director Krish) జాగర్లమూడి మాట్లాడుతూ.. ‘దిల్ రాజు ప్రొడ‌క్షన్స్ అనే బ్యాన‌ర్‌(Banner)పై సినిమాలు చేస్తున్న హ‌ర్షిత్‌, హ‌న్షత‌ల‌కు అభినంద‌న‌లు. కొత్త మాధ్యమంలోకి అడుగు పెట్టారు. హ‌రీష్ ఈ సిరీస్‌కు క‌థ‌ను అందిచంటంతో పాటు షో ర‌న్నర్‌గానూ వ‌ర్క్ చేశారు. బిగ్ స్క్రీన్‌పై(Big Screen play) చెప్పలేక‌పోతున్న క‌థ‌ల‌ను ఓటీటీల్లో చెప్పటానికి ప్రయ‌త్నిస్తున్న హ‌రీష్‌ను ఈ సంద‌ర్భంగా అభినందిస్తున్నాను. డైరెక్టర్ చంద్ర మోహ‌న్ సిరీస్‌ను చ‌క్కగా తీశారు.. ట్రైల‌ర్ చూడ‌గానే అర్థమ‌వుతుంది. మ్యూజిక్ డైరెక్టర్(Music Director) ప్ర‌శాంత్ విహారి మా అంత‌రిక్షం సినిమాలో వ‌ర్క్ చేశాడు. మంచి మ్యూజిక్‌, బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. స‌న్ని, రాయ‌ల్‌, కృష్ణ, ర‌వి, సుబ్బ‌రాజ్‌గారు, దివ్య వాణిగారు, ష‌ఫీ, పృథ్వీగారికి కంగ్రాట్స్‌. ఇలాంటి కొత్త కంటెంట్‌తో మ‌రిన్ని ప్రొడ‌క్షన్ హౌసెస్ ఓటీటీల్లోకి రావాలి’ అని కోరారు.

వీజే స‌న్నీ(VJ Sunny) మాట్లాడుతూ.. ‘నా జర్నీ చూసుకుంటే మనసులో తెలియని ఉద్వేగంగా ఉంది. ఈరోజు నాకెంతో స్పెష‌ల్‌. ATM నా జీవితంలో మ‌ర‌చిపోలేని జ‌ర్నీ. మంచి అవ‌కాశం కోసం వెయిట్ చేస్తున్నప్పుడు దిల్ రాజుగారి బ్యాన‌ర్‌లో వ‌ర్క్ చేస్తావా! అని కాల్ వ‌చ్చింది. నేను షాక‌య్యాను. ఎందుకంటే ఈ అవ‌కాశం కోస‌మే వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా దిల్ రాజుగారి బ్యాన‌ర్‌లో వ‌ర్క్ చేయ‌టానికి నేను సిద్ధంగా ఉంటాను. హ‌రీష్ శంక‌ర్‌గారికి ల‌వ్ యూ. హ‌ర్షిత్‌గారు మిస్టర్ కూల్‌.. హ‌న్షిత మాతో క‌లిసి పోయి వ‌ర్క్ చేశారు. సుబ్బరాజ్‌గారు కంపోజ్డ్‌గా ఉండే గొప్ప న‌టుడు. అలాగే ష‌ఫీ, పృథ్వీగారికి థాంక్స్‌. నాతో పాటు వ‌ర్క్ చేసిన రాయ‌ల్, కృష్ణ, ర‌వికి ఆల్ ది బెస్ట్. దివికి, డీఓపీ మోనిక్‌కి, మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్‌కి థాంక్స్‌. మా కెప్టెన్ చంద్రమోహ‌న్‌తో వ‌ర్క్ చేయ‌టం అమేజింగ్‌. మాట‌ల్లో చెప్పలేని క‌ష్టాన్ని ప‌డ్డారు’ అని తెలిపారు.సుబ్బరాజ్ మాట్లాడుతూ.. ‘‘దిల్ రాజు, హరీష్, హర్షిత్, హన్షిత వండర్ ఫుల్ క్యారెక్టర్‌నిచ్చారు. దాన్ని చందు నామీద అద్భుతంగా అలంక‌రించాడు. స‌న్ని, రాయ‌ల్, కృష్ణ, ర‌విల‌ను చూస్తుంటే నాకెరీర్ స్టార్టింగ్ డేస్ గుర్తుకు వ‌చ్చాయి. నా రోల్‌కు ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుందో చూడాల‌ని ఆస‌క్తిగా వెయిట్ చేస్తున్నాను’ అన్నాడు.

నిర్మాత హ‌ర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ATM సిరీస్ హ‌రీష్‌గారి ఐడియా నుంచి స్టార్ట్ అయ్యింది. ఆడిష‌న్స్(Audition) చేసి న‌టీన‌టుల‌ను ఎంపిక చేసుక‌న్నాం. సన్నీ, రోయ‌ల్‌, కృష్ణ, ర‌వి మంచి యాక్టర్స్‌గా పేరు తెచ్చకుంటారు. దివికి థాంక్స్‌. అలాగే పృథ్వీ, ష‌ఫీగారికి థాంక్స్‌. సుబ్బ‌రాజ్‌గారు మా కోసం ఇందులో న‌టించారు. ఆయ‌న లేక‌పోతే ATM బాగా వ‌చ్చేది కాదు. మంచి యాక్షన్ ఎపిసోడ్స్‌ను కంపోజ్ చేసిన యాక్షన్ మాస్టర్స్‌కి, ఇత‌ర టీమ్‌కి థాంక్స్‌. ఔట్ సైడ్ ఫ్యామిలీ మెంబ‌ర్స్‌కి ఎంద‌రికో స‌పోర్ట్ చేసిన దిల్ రాజుగారు.. మాకు అవ‌కాశం ఇచ్చి ఆయ‌న పెద్ద మ‌న‌సుని చాటుకున్నారు ఆయ‌న‌కు ఈ సంద‌ర్భంగా థాంక్స్‌’’ అన్నారు.

నిర్మాత హన్షిత మాట్లాడుతూ ‘‘మా దిల్ రాజు ప్రొడ‌క్షన్స్ ఫ‌స్ట్ బేబీ ఈ ATM. ఇదొక గేమ్ చేంజ‌ర్(Game Changer) అని న‌మ్ముతున్నాం. నాన్నగారి మైండ్‌, హ‌రీష్ అన్న గుండె క‌లిసే ATM క్రియేట్ అయ్యింది. వారిద్దరి అండ‌ర్‌స్టాడింగ్ చాలా బావుంటుంది. జీ 5కి థాంక్స్‌. ATMలోని ప్రతి ఒక యాక్టర్‌లోని డిఫ‌రెంట్ కోణాన్ని చూడ‌బోతున్నారు. ఆర్య నుంచి సుబ్బరాజ్‌గారిని చూస్తున్నాం. మ‌రోసారి ఆయ‌న త‌న‌దైన స్టైల్లో డిఫ‌రెంట్ రోల్(Different Role) చేశారు. త‌న‌కు అభినంద‌న‌లు. స‌న్ని, కృష్ణ, రోయ‌ల్, ర‌వి అంద‌రూ యూనిక్ రోల్స్ చేశారు. దివి, దివ్యవాణిగారు అద్భుతంగా న‌టించారు. పృథ్వీ, ష‌ఫిగారికి థాంక్స్‌. మోనిక్‌గారు అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చారు. ప్రశాంత్ విహారి త‌న మ్యూజిక్‌తో ATMను నెక్ట్స్ లెవ‌ల్‌లో ఎలివేట్ చేశాడు. అలాగే మా కెప్టెన్ చంద్రమోహ‌న్‌గారి విష‌యానికి వ‌స్తే.. ఇంత ఇటెన్షన్‌తో తీయ‌వ‌చ్చున‌ని ATMతో చూపించారు. జీ 5లో జ‌న‌వ‌రి 20 నుంచి అందుబాటులోకి రానుంది. ప్రొడ‌క్షన్ టీమ్‌కి థాంక్స్‌’’ అన్నారు.

హ‌ను రాఘ‌వ‌పూడి మాట్లాడుతూ ‘‘తెలుగులో ఇప్పటివ‌ర‌కు కొన్ని మంచి వెబ్ సిరీస్‌లు వ‌చ్చాయి. కానీ అందులో మంచి సిరీస్‌లంటూ వ‌చ్చివ‌ని జీ 5లోనే అని అనుకుంటున్నాను. ATM మూడేళ్ల జ‌ర్నీ అని హ‌రీష్ అన్నారు. సిరీస్ చూస్తుంటే కొత్త‌గా అనిపిస్తుంది. కానీ యాక్టర్స్ మాత్రం కొత్తగా క‌నిపించ‌టం లేదు. అందుకు ద‌ర్శకుడు చంద్ర మోహ‌న్‌గారు(Director Chandra Mohan) కార‌ణ‌మ‌ని తెలుస్తుంది. ప్రశాంత్ విహారిగారి బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం వెయిట్ చేస్తున్నాం’’ అన్నారు.యాక్టర్ రోయ‌ల్ శ్రీ మాట్లాడుతూ ‘‘యాక్టర్‌గా దిల్ రాజు ప్రొడ‌క్షన్స్ నుంచి ప‌రిచ‌యం అవుతుండ‌టం హ్యాపీగా ఉంది. హ‌ర్షిత్, హ‌న్షిత‌ల‌కు థాంక్స్‌. వీరు మ‌రిన్ని ప్రాజెక్ట్స్ చేసి ఇంకా కొత్త వారిని ప‌రిచ‌యం చేయాల‌ని అనుకుంటున్నాను. హ‌రీష్ శంక‌ర్‌గారికి ఎప్పటికీ థాంక్స్ చెబుతూనే ఉంటాను. ఈ సిరీస్‌తో చంద్ర మోహ‌న్‌గారు మంచి క్రేజ్ ఇచ్చారు. సుబ్బరాజ్‌గారు, ష‌ఫిగారు, దివ్యవాణిగారు, పృథ్వీగారు స‌హా అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.

క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్(Creative Producer) కె.ఆర్‌.కె మాట్లాడుతూ ‘‘తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోని పెద్ద నిర్మాత‌, ద‌ర్శకుడు క‌లిసి ఓ సిరీస్ చేయ‌టం చాలా గొప్ప విష‌యం. వారికి నా అభినంద‌న‌లు. ఈ సిరీస్‌తో చాలా కొత్త టాలెంట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. హ‌ర్షిత్‌, హ‌న్షిత‌గారు ప‌ర్ఫెక్ట్‌గా సిరీస్‌ను పూర్తి చేశారు. మా టీమ్‌కు కంగ్రాట్స్‌’’ అన్నారు.నిర్మాత శ‌ర‌త్ చంద్ర మాట్లాడుతూ ‘‘డిజిటల్ కంటెంట్ అనేది ఎక్స్‌పెరిమెంట్‌కు పెద్ద వేదిక‌. అలాంటి దానిపై దిల్‌రాజు, హ‌రీష్‌గారు క‌లిసి కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ ATM అనే సిరీస్ చేశారు. ఈ సిరీస్ ఎంత బాగా వ‌చ్చింద‌నేది క్రెడిట్ అంతా చంద్ర మోహ‌న్‌గారికే ద‌క్కుతుంద‌ని హ‌రీష్‌గారు అన్నారు. దిల్ రాజుగారు, హ‌ర్షిత్, హ‌న్షిత‌ల కార‌ణంగా ఇంకా చాలా మంది ఇటు వైపు వ‌స్తార‌ని అనుకుంటున్నాను’’ అన్నారు.యాక్టర్ రవి రాజ్ మాట్లాడుతూ ‘‘ATM సినిమాలో నాకు మంచి పాత్ర ఇచ్చిన హరీష్‌గారికి, దిల్ రాజుగారికి, డైరెక్టర్ చంద్రమోహ‌న్‌గారికి, హ‌ర్షిత‌, హ‌న్షిత గారికి థాంక్స్‌. జీ 5 వారికి థాంక్స్‌. సుబ్బరాజ్‌గారు, ష‌ఫిగారు, పృథ్వీగారికి థాంక్స్‌. ప్రశాంత్‌గారు ఆర్ఆర్ ఇర‌గ‌దీశారు’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి మాట్లాడుతూ ‘‘దిల్‌రాజు, హ‌రీష్ శంక‌ర్‌గారు డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చారు. సాధార‌ణంగా మేక‌ర్స్ అయినా, టెక్నీషియ‌న్స్ అయినా ఓ జోన‌ర్‌లో ఉండాల‌ని ట్రై చేస్తుంటారు. దానికి భిన్నంగా చేసిన సిరీస్ ATM. చాలా ఎంజాయ్ చేశాను. ఇది నా తొలి ప్ర‌య‌త్నం. డైరెక్టర్ చంద్రగారికి థాంక్స్‌. హ‌ర్షిత్‌, మెహ‌ర్, హ‌న్షిత‌గారికి థాంక్స్‌’’ అన్నారు.దిల్ రాజు ప్రొడ‌క్షన్స్ సి.ఇ.ఓ మెహ‌ర్ కిలారు మాట్లాడుతూ ‘‘ATM సిరీస్‌కి రాజుగారు, హ‌రీష్‌గారు, హ‌ర్షిత్‌, హ‌న్షిత‌గారే బాస్‌లు. సాధార‌ణంగా సినిమాలు చేసే మేక‌ర్స్ వెబ్ సిరీస్‌లు చేసిన‌ప్పుడు హండ్రెడ్ ప‌ర్సెంట్ డేడికేష‌న్ మ‌న‌కు క‌నిపించ‌దు. కానీ.. హ‌రీష్‌గారు, హ‌ర్షిత్‌గారు అంతే ఎఫ‌ర్ట్ పెట్టారు. ఆయ‌న్ని నుంచి చాలా విష‌యాలు నేర్చుకోవాలి. వాళ్లు ఆడియెన్స్‌కి ఇచ్చే రెస్పెక్ట్ అదే’’ అన్నారు.సినిమాటోగ్రాఫ‌ర్ మోనిక్ మాట్లాడుతూ ‘‘ATM నా డెస్టినీ అనుకోవాలి. నేను చాలా రోజుల క్రితం మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు అందులో నేను వ‌ర్క్ చేస్తాన‌ని అనుకున్నాను. కానీ ఎలాగో నాకే తెలియ‌లేదు. హ‌ర్షిత్‌గారు, హ‌న్షిత‌గారి వ‌ల్ల అది సాధ్యమైంది. చంద్రమోహ‌న్‌కి థాంక్స్‌. ప్రశాంత్ మంచి పాట‌లే కాదు.. బ్యూటీఫుల్ ఆర్ఆర్ ఇచ్చారు’’ అన్నారు.

దివి(Divi) మాట్లాడుతూ ‘‘దిల్‌రాజుగారి బ్యాన‌ర్‌లో నేను మ‌హ‌ర్షిలో వ‌ర్క్ చేశాను. ఇప్పుడు ATMలో మెయిన్ లీడ్‌లాగా చేయటం వండ‌ర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన్స్‌.హ‌రీష్‌గారి రైటింగ్స్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. డైరెక్టర్ చందుగారికి థాంక్స్‌. చాలా కంఫ‌ర్ట్ జోన్‌లో ఉంచి న‌టీన‌టుల నుంచి ఔట్‌పుట్ తీసుకున్నారు. నా స‌హ న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్‌కి థాంక్స్‌’’ అన్నారు.యాక్టర్ కృష్ణ మాట్లాడుతూ ‘‘సినిమాలో నా రోల్‌కి పాట‌లున్నాయి. దిల్‌రాజుగారికి, హరీష్ శంక‌ర్‌గారికి, హ‌ర్షిత్, హ‌న్సిత‌గారికి థాంక్స్‌. హ‌రీష్ శంక‌ర్‌గారు మంచి క‌థ‌ను రాయ‌ట‌మే కాకుండా, నాకు చాలా మంచి పాత్రను ఇచ్చారు. ఈ సిరీస్ ప‌రంగా ఏదైనా మంచి క్రెడిట్ వ‌స్తే.. అది ద‌ర్శకుడు చంద్ర మోహ‌న్‌గారికే ద‌క్కుతుంది. అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.ష‌ఫి మాట్లాడుతూ ‘‘రాజుగారికి, హరీష్ శంకర్ గారు చాలా ప్లాన్‌తో ఏటీఎం సిరీస్ చేశారు. ఇందులో నేను ఓ అద్భుత‌మైన పాత్రలో క‌నిపిస్తాను. నా కంటే సుబ్బరాజ్‌గారు, స‌న్ని, దివి గారి పాత్రలుంటాయి. ప్రశాంత్‌గారి మ్యూజిక్ ఎక్స్‌ట్రార్డిన‌రీ. మోనిక్‌గారి విజువ‌ల్స్ అమేజింగ్‌. సుబ్బరాజ్ ఇప్పటి వ‌ర‌కు చేసిన రోల్స్ ఒక ఎత్తు అయితే ఈ సిరీస్‌లో చేసిన హెగ్డే పాత్ర అంద‌రికీ గుర్తుండిపోతుంది. నా రోల్‌కు చందుగారు ఓ ఫిలాసిఫిక‌ల్ ట‌చ్ ఇచ్చారు. ఏటీఎం టీమ్‌కు ముందుగానే అభినంద‌న‌లు తెలియజేస్తున్నాను’’ అన్నారు.

దివ్య వాణి మాట్లాడుతూ ‘‘ఏటీఎం సిరీస్‌లో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పటివ‌ర‌కు నేను చేసిన పాత్రలు ఓ స్టైల్లో ఉంటే, ఇప్పుడు చేసిన పాత్రతో పాటు అందులో డైలాగ్ డెలివ‌రీ(Dialog Delivery), స్టైల్ మ‌రో కోణంలో ఆక‌ట్టుకోనున్నాయి’’ అన్నారు.కాస్టింగ్ డైరెక్టర్ పుష్ప భాస్కర్ మాట్లాడుతూ ‘‘ఎన్టీఆర్‌గారి బ‌యోపిక్ చేసిన త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్‌గారు డైరెక్ట్ చేసిన గ‌ద్దల కొండ గ‌ణేష్ సినిమాకు కూడా కాస్టింగ్ డైరెక్టర్‌గా వ‌ర్క్‌చేశాను. దిల్ రాజుగారికి థాంక్స్‌. హ‌రీష్ శంక‌ర్‌గారితో పాటు చందుగారు ఇచ్చిన ఫ్రీడ‌మ్ కార‌ణంగా నేను కొత్త టాలెంట్‌ను ప‌రిచ‌యం చేయ‌గ‌లిగాను’అంటూ చెప్పుకొచ్చాడు.

(AP:చిరంజీవి కాంగ్రెస్‌లోనే ఉన్నారు)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -