దేశ రైతాంగం ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా భారత్‌బంద్ సంపూర్ణమయ్యింది. యావత్ దేశ రైతులతో పాటు, ప్రజా సంఘాలు, వ్యాపారులు, చిరువ్యాపారులు, బీజేపీయేతర రాష్ట్రాలు, బీజేపీయేతర పార్టీలు బంద్‌ను విజయవంతం చేశాయి. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు కొనసాగిన బంద్‌లో దేశ ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్ని ప్రధాన రోడ్లను దిగ్భందించి, వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దుకాణాలను మూసివేయించారు. బంద్ విజయవంతమవడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇకనైనా కేంద్రప్రభుత్వం కళ్లు తెరవాలని, రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలన్నారు.
కాగా, బంద్ ముగియడంతో రవాణా వ్యవస్థ యథావిధంగా కొనసాగుతోంది. దుకాణ సమూదాయాలు తెరుచుకున్నాయి. ప్రజా జీవితం గాడిన పడింది.