end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంటీఆర్ఎస్‌ను ఢీ కొట్టే సత్తా బీజేపీకి ఉంది
- Advertisment -

టీఆర్ఎస్‌ను ఢీ కొట్టే సత్తా బీజేపీకి ఉంది

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని ఎదిరించే సత్తా బీజేపీకే ఉందంటూ కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చూస్తే బీజేసీ సత్తా ఏంటో అర్థమవుతుందని ఆయనన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెలువడుతున్న సమయంలో ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. ఉద్యోగులు పూర్తిగా టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నారన్న విషయం పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో స్పష్టమైందని, అంతేకాకుండా టీఆర్‌ఎస్‌ను ఎదిరించే సత్తా బీజేపీకే ఉందనే విషయం వారు కచ్చితంగా నమ్ముతున్నారని ఆయన చెప్పారు.

అయితే ఓ కాంగ్రెస్ నేత మరో పార్టీని ప్రశంసించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే విశ్వేశ్వరరెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరతారన్న వార్తలూ వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోందని చెప్పవచ్చు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -