end

బీజేపీ అసత్య ప్రచారం చేస్తోంది: మంత్రి హరీష్‌

ONGCలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు

బీజేపీ పార్టీ నాయకులు ప్రజలకు తప్పుడు సంకేతాలిస్తున్నారని మంత్రి హరీష్‌ రావు విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను బీజేపీ పార్టీ ఆధీనంలో ఉన్న కేంద్రం విడుదల చేయడం లేదని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఆ పార్టీ నాయకులు నోటికొచ్చినట్లు వాగుతున్నారనీ.. అదే నిజమైతే ఆధారాలు చూపించాలన్నారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే అభివృద్ధి చేసుకుంటామని ఆయన అన్నారు.

ప్రాణాలు తీసిన అక్రమ సంబంధం

దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతతో కలిసి నార్సింగిలో శనివారం నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. సామాజిక మాధ్యమాల్లో బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని యువత తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దుబ్బాక అభివృద్ధి బాధ్యత తనదేనని, సుజాత గారిని గెలిపించుకొని హుజూర్‌నగర్‌ మాదిరిగా ప్యాకేజీ సాధించుకుని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందామని మంత్రి ఓటర్లకు పిలుపునిచ్చారు.

లాక్‌డౌన్‌ దిశగా యూరప్‌ దేశాలు

Exit mobile version