అతివేగం తో తల్లిదండ్రులకి బాదని మిగిలిచి వెళ్లిపోయాడు.శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో నల్గొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత కొడుకు దినేష్‌రెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్‌పై మంగళవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ముందు వెళ్తున్న డీసీఎం వ్యాన్‌ను ఓవర్‌టేక్ చేసే క్రమంలో హ్యుందాయ్ వెర్నా కారు దాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి బోల్తా పడటంతో అందులోని యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు.
ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలోని సీసీటీవీ పుటేజీ పరిశీలించగా అతివేగంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. చనిపోయిన యువకుడిని నల్గొండ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీపీ రెగట్టే మల్లికార్జునరెడ్డి కుమారుడు దినేష్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. దినేష్‌రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తమ కొడుకు కళ్లను దానం చేసేందుకు తల్లిదండ్రులు ముందుకు రావడంతో వైద్యులు వాటిని సేకరించారు. అనంతరం దినేష్‌రెడ్డి మృతదేహాన్ని నల్లగొండలోనీ వీటి కాలనీలోని స్వగృహానికి మృతదేహాన్ని తరలించారు. మల్లికార్జునరెడ్డి కుటుంబాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి తదితరులు పరామర్శించారు.