- జోష్‌లో థియేటర్ యాజమాన్యాలు, సినీ ప్రియులు
దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్ల యజమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇవాళ్టి నుంచి 100 పర్సెంట్ సీటింగ్ కెపాసిటీతో సినిమాలు వేసుకోవచ్చని తెలిపింది. దీంతో థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కోవిడ్ కారణంగా ఆరేడు నెళ్లపాటు నిలిచిపోయిన థియేటర్లు.. గత కొన్ని రోజులుగా 50 పర్సెంట్ సీటింగ్ కెపాసిటీతో ఓపెన్ చేశారు. ప్రస్తుతం 100 పర్సెంట్ సీటింగ్‌కు అనుమతివ్వడంతో టాకీస్‌ల యజమానులకు ఊరట లభించినట్టయింది. అభిమానులకు కూడా ఇది శుభవార్తే. తమ అభిమాన హీరోల సినిమాలు థియేటర్లలో చూడక.. ఎన్నిరోజులైందో.
కాగా, టికెట్ అడ్వాన్స్ బుకింగ్ కోసం రోజంతా టికెట్ కౌంటర్లు తెరిచే ఉంచాలని కేంద్రం గైడ్‌లైన్స్ ఇచ్చింది. ఆన్‌లైన్, వాలెట్స్ ద్వారా టికెట్ బుకింగ్ ప్రోత్సహించాలంది. కొవిద్ నిబంధనలు పాటిస్తూ థియేటర్ లోపల కచ్చితంగా 24-30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. రద్దీ తగ్గించేందుకు ఎక్కువ షోలు వేయాలని తెలిపింది.