end
=
Friday, March 28, 2025
Sample Page
- Advertisment -

Sample Page Title

- Advertisment -
- Advertisment -

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పై బిజేపి నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారు మాట్లాడుతూ ఈటల రాజేందర్ తన ఆస్తులను కాపాడుకోవడం కోసం కన్న తల్లి లాంటి టి ఆర్ ఎస్ పార్టీ ని వదిలి తండ్రి లాంటి ముఖ్యమంత్రి కేసీఅర్ ను వెన్నుపోటు పొడిచి మతతత్వ పార్టీ ప్రజా పీడిత పార్టి ఐన బిజేపి లో చేరారు. మంత్రి పదవి లో వుండి పేద ప్రజల భూములు ఆక్రమించుకున్నారు. కపట నాటకమాడి ప్రజలను మభ్యపెట్టి ఇటివల జరిగిన ఉప ఎన్నికలలో ఈటల రాజేందర్ గెలిచారు ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేగా గెలిచి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఒక్క అభివృద్ది పనికి కూడా కేంద్రం నుండి నిధులు తేలేదు. నల్లచట్టాలు అని బిజేపి పార్టీ ని వేతిరేకించిన పార్టీలో ఎలా చేరారో చెప్పాలి మళ్ళీ హుజూరాబాద్ లో పోటీ చేస్తే డిపాజిట్ గల్లంతు ఐతదని ఊహించి ఈటెల రాజేందర్ హుజూరాబాద్ లో పోటీ చేయనని చెప్తున్నారు. మాయ మాటలతో ప్రజలనుండి ఓట్లు వేయించుకొని గెలిచిన ఈటల రాజేందర్ కు మహానాయకుడైన ముఖ్యమంత్రిని విమర్శించే అర్హత లేదు. ఈ కార్యక్రమంలో దేశినీ కోటి గారు,మాజీ సర్పంచ్ తెరాస సీనియర్ నాయకులు పోనగంటి మల్లయ్య గారు,PACS చైర్మెన్ పోనగంటి సంపత్ గారు,గౌరవ మున్సిపల్ కౌన్సిలర్స్ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గోన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -