న్యూఢిల్లీ: భారత్ చైనాకిచ్చిన ఝలక్ మామూలుగా లేదు. కేవలం నాలుగు నెలల్లోనే ఆ దేశ సోషల్ మీడియా యాప్‌లన్నీ రద్దు చేసేసింది. దీని ప్రభావం చైనాను తీరుకోలేని దెబ్బ కొట్టింది. లద్దాఖ్ ఘర్షణ తరువాత చైనాకు దిమ్మతిరిగేలా భారత్అ నేక సంచలన నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యమైనది చైనా యాప్‌లను నిషేధించడం! అంతకుమునుపు ప్రపంచంలో మరే దేశం ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో భారత్‌లో చైనా యాప్‌లలో కొన్ని ముఖ్యమైనవి రాత్రికి రాత్రి కనుమరుగైపోయాయి. ఈ పరిస్థితి ఇచ్చిన అవకాశాన్ని కూడా భారత్ ప్రభుత్వం దేశ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చుకుంది. సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల విషయంలో స్వాలంబన సాధించేందుకు భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
కేంద్రం అంతకుముందే ప్రకటించిన ‘ఆత్మనిర్భర్ భారత్’ విధానం ఇచ్చిన స్ఫూర్తితో.. భారత దేశ ప్రజలకు కావాల్సిన ఉత్పత్తులు దేశీయంగానే తయారు కావాలని, ఈ లక్ష్యాన్ని చేరుకునే దిశగా యువత, వ్యాపారులు ముందడుగు వేయాలంటూ పిలుపునిచ్చింది. క్షేత్రస్థాయిలో అనేక చర్యలను ఏర్పాటు చేయడంతో పాటూ ఈ విధానంపై విస్తృత ప్రచారం కల్పిస్తూ ప్రజలను ప్రోత్సహించింది. ఈ ప్రయత్నాల తొలి ఫలితం ఇటీవల వెల్లడైంది. టిక్‌టాక్ అనే మహావృక్షం నీడలోపడి ప్రేక్షకుల ఆదరణకు దూరమైన దేశీ యాప్‌లు క్రమంగా యువతకు చేరువవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో వీటిదే హవా..!
తొలి నుంచి అదరగొట్టేసింది…!
టిక్‌టాక్.. భారత యువతను ఒకప్పుడు తన వంశం చేసుకున్న యాప్. కంటెంట్ క్రియేటర్లకేమో మంచి ఆదాయం, ఫాలోయర్ల ద్వారా వచ్చే పాపులారిటీ.. అశేష యువ ప్రజానీకానికేమో అద్భుత ఎంటటైర్మెంట్.. వెరసి టిక్‌టాక్‌కు ఎదురేలేకుండా పోయింది. చూస్తుండగానే.. భారత్‌లో షార్ట్ వీడియోల మార్కెట్‌లో ఏకంగా 85-90 శాతం వాటా టిక్‌టాక్ పరమైంది. ఈ యాప్ ద్వారా భారతీయుల వ్యక్తిగత సమాచారం సరిహద్దులు దాటచ్చుంటూ నిపుణులు ఓవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ఫలితం లేకపోయింది. ఒక్కముక్కలో చెప్పాలంటే.. టిక్‌టాక్ ఈజ్ ద కింగ్. దేశంలోని అత్యధిక శాతం మంది యువత టిక్‌టాక్ వినియోగ దారులు కావడంతో అనేక కంపెనీలు యువతనే ఫాలోయ్యాయి. తన ఉత్పత్తులను మార్కెట్ చేసుకునేందుకు టిక్‌టాక్‌నే ఎంచుకున్నాయి. దీంతో అటు..మార్కెట్‌కు ఇటు మనీకి టిక్‌టాకే కేంద్ర బిందువైంది. ప్రభంజనంలో పడి ఎన్నో దేశీ యాప్‌లు యువతను ఆకర్షించేందుకు నానా యాతనా పడేవీ. ఇంతలో పరిస్థితులు ఎవ్వరూ ఊహించని యూటర్న తీసుకున్నాయి.
లద్దాఖ్‌లో చైనా ప్రదర్శించిన విస్తరణ వాదం, దూకుడుతో భారత్‌కు చిర్రెత్తింది. ఫలితంగా.. తొలి వేటు టిక్‌టాక్‌పై పడింది. టిక్‌టాక్ నిషేధం ఇచ్చిన అనూహ్య అవకాశాన్ని దేశీ యాప్‌లు వేగంగా అందిపుచ్చుకున్నాయి. రెడ్ సీర్ అనే సంస్థ చేపట్టిన సర్వే ప్రకారం ప్రస్తుతం..టిక్‌టాక్ మార్కెట్‌లో దాదాపు 67 శాతం ప్రస్తుతం దేశీ యాప్‌లు కైవసం చేసుకున్నాయి. అంతేకాదు.. ఒకప్పటి టిక్‌టాక్ వినియోగ దారుల్లో అధిక శాతం మందికి దేశీ యాప్‌ల గురించి తెలుసునని చెప్పారట. ఒకప్పుడు భారత్ యువత టిక్‌టాక్ కోసం సగటున నెలకు 165 బిలియన్ నిమిషాలు కేటాయిస్తే..ప్రస్తుతం దేశీ యాప్‌లకు వారు 55 బిలియన్ నిమిషాలు కేటాయిస్తున్నారట. టిక్‌టాక్ కనుమరుగైన అనంతరం మెల్లగా ప్రారంభమైన దేశీ యాప్‌ల పాపులారిటీ గత నాలుగు నెలల్లో బాగానే పుంజుకుంది.
అయితే..దేశీ యాప్‌ల విషయంలో ఇప్పటికీ అనేక సమస్యలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా టిక్‌టాక్‌లో లాగా ఆకట్టుకునే మంచి కంటెంట్ లేమి, తక్కువగా వీడియోలు రిలీజ్ అవ్వడం, కంటెంట్ క్రియేట్చే సేందుకు అవసరమైన టూల్స్ లేకపోవడం వంటి సమస్యలతో దేశీ యాప్‌లు సతమతమవుతున్నాయి. అయితే..2025 నాటికి ఈ మార్కెట్ 580 మిలయన్ యూజర్లకు చేరుకుంటుందని, ఈ అవకాశాన్ని దేశీ కంపెనీలు అందిపుచ్చుకోవాలని రెడ్ సీర్ సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి.