end

రాష్ట్రపతికి సీఎం ఘనస్వాగతం

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై ఎస్‌ జనన్‌మోహన్‌ రెడ్డి ఘనస్వాగతం పలికారు. తిరుమల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి రామ్‌నాథ్‌.. మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ బొకే అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం, ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో తిరుచానూరు చేరుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకుంటారు. అనంతరం 12.15 గంటలకు తిరుమల చేరుకుంటారు. శ్రీవారి దర్శనానంతరం 4.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయానకి చేరుకుని, అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు వెళతారు.

Exit mobile version