end

Casino Case:తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోన్న చీకోటి లింకులు

  • ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్న రాజకీయ నేతలు

Casino Case: క్యాసినో కేసులో భాగంగా చీకోటి లింకులు తెలుగు (Telugu states) రాష్ట్రాలను షేక్ చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్న రాజకీయ నేతలు జంకుతున్నారు. ముఖ్యంగా ఈ క్యాసినో వ్యవహారంలో పొలిటికల్ (Political)లింకులే ఎక్కువగా బయటపడుతుండటం విశేషం. కాగా ప్రవీణ్ (Chikoti Praveen)లిస్ట్‌లో తెలంగాణలోనే కాదు ఏపీలోనూ కీలక నేతలకు ఈడీ (ED) నోటీసులు పంపిస్తోంది.

ఈ కేసులో భాగంగా తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి (Gurunath Reddy)తో పాటు మాజీ ఎంపీ బుట్టా రేణుక (Butta Renuka) సోదరుడు యుగంధర్‌ (Yugandhar)ని కూడా ఈడీ విచారించింది. ఈ యుగంధర్ రెడ్డికి పంజాగుట్టలో ఊర్వశి బార్ (Panjagutta Urvashi Bar)కూడా ఉంది. ఫారిన్ ఎక్స్ చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (Foreign Exchange Management Act)ను ఉల్లంఘించారనేది వీళ్లపై ఉన్న ఆరోపణ. చీకోటి కేసినోల్లో పాల్గొనడానికి విదేశాలకు వెళ్లారని, హవాలా ద్వారా డబ్బులు చెల్లించారన్న ఆరోపణలపై ఈడీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మళ్లీ ఎప్పుడు కావాలంటే అప్పుడు విచారణకు రావాల్సిందిగా ఈడీ ఆదేశించినట్టు సమాచారం.

(Telangana:కొత్త సచివాలయ పనుల్ని పరిశీలించిన కేసీఆర్)

ఇప్పటికే మంత్రి తలసాని సోదరులు మహేష్‌, ధర్మేంద్రలను (Thalasani brothers Mahesh and Dharmendra) బుధవారం 10 గంటల పాటు అధికారులు విచారించారు. క్యాసినోతో పాటు ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్‌, హవాలా చెల్లింపు (Financial Transactions, Money Laundering, Hawala Payment)లపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. శుక్రవారం వీళ్లిద్దరినీ మరోసారి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, మెదక్‌ డీసీసీబీ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డిల (RS MLC L. Ramana, Medak DCCB Chairman Devender Reddy)ను కూడా శుక్రవారం విచారించబోతున్నారు అధికారులు. చీకోటి ప్రవీణ్, మాధవ్‎రెడ్డి కాల్‎డేటా (Madhav Reddy Call Data) ఆధారంగా ఈ కేసు ఎంక్వైరీ (Inquiry)జరుగుతోంది. ట్రావెల్ ఏజెన్సీ ద్వారా ఫ్లైట్ బుకింగ్స్  (Flight bookings through travel agency) వివరాలు సేకరించిన ఈడీ.. అనుమానితులను విచారణకు పిలుస్తున్నారు. మొత్తంగా ఈ కేసులో ఇప్పటి వరకు వంద మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. నేపాల్ (Nepal) వెళ్లిన కేసీను పాడిన అందరికీ నోటీసులు ఇస్తోంది ఈడీ. రాజకీయ నేతలు, వారితో సంబంధాలున్నవారే ఈ కేసుల్లో ఉన్నారు. అలాగే నోటీసులు అందిన వారికి సంబంధించి.. 4 సంవత్సరాల ఆర్ధిక లావాదేవీలపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో నోటీసులు అందుకున్న వారి పేర్లు బయటకు వచ్చే కొద్దీ సంచలనంగా మారుతోంది. ముందు ముందు మరికొంత మంది విచారణ ఎదుర్కోక తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాగా ఈ ఇష్యూపూ పార్టీ అథినేతలు రెండు రాష్ట్రాల ముఖ్యం మంత్రులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Exit mobile version