end
=
Friday, November 22, 2024
వార్తలురాష్ట్రీయంసైబర్ నేరగాళ్ల వలలో పడిన డాక్టర్...
- Advertisment -

సైబర్ నేరగాళ్ల వలలో పడిన డాక్టర్…

- Advertisment -
- Advertisment -

డాక్టర్ చదివారు ఏమి లాభం. అమ్మాయిల విషయం లో డాక్టర్ అయిన యాక్టర్ అంతేనా. మరారా. హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్ సైబర్ నేరగాళ్ల వలలో పడి ఏకంగా కోటిన్నర రూపాయలు కోల్పోయాడు. డేటింగ్ యాప్‌లో చాటింగ్ చేసే అమ్మాయిల గురించి సెర్చ్ చేసే అతడి బలహీనతను ఆసరగా చేసుకొని సైబర్ నేరగాళ్లు ఆయణ్ని తెలివిగా మోసం చేశారు. డాక్టర్ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి యాప్‌ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్ గుజరాత్‌లో పనిచేస్తున్నాడు. వెబ్‌సైట్‌, యాప్‌లలో డేటింగ్‌ చేసే యువతుల కోసం ఆన్‌లైన్‌లో అతడు గాలించాడు. ఆ విషయాన్ని గమనించిన సైబర్‌ నేరగాళ్లు అటు నుంచి స్పందించారు. అమ్మాయిని పంపుతామంటూ డబ్బులు వసూలు చేశారు. ఇలా విడతల వారీగా వైద్యుడి వద్ద నుంచి రూ.40 లక్షలు కాజేశారు. మోసపోయానని గ్రహించిన సదరు డాక్టర్.. 2020 అక్టోబరులో సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. కేసు దర్యాప్తులో ఉండగానే మరో రూ.30 లక్షలు నిందితుల అకౌంట్‌కు బదిలీ చేశాడు.కుటుంబ సభ్యులు అతడి ఖాతాను పరిశీలించి గత మూడేళ్లలో మొత్తం కోటిన్నర రూపాయలకు పైగా డబ్బు బదిలీ చేసినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు అతడికి డేటింగ్‌ వెబ్‌సైట్ల మోసాలపై కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినా, అతడి తీరు మారలేదు. ఇలాంటి డేటింగ్‌ వెబ్‌సైట్లు, యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సూచిస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -