end

పోలీసుల కృషి వెలకట్టలేనిదిః ప్రధాని

పోలీసుల కృషి వెలకట్టలేనిదని ప్రధాని నరేంద్రమోది అన్నారు. ఇవాళ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. ఈ సందర్భంగా ప్రధాని.. పోలీసు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో పోలీసులు ప్రాణాలకు తెగించి పోరాడతారని ఆయన గుర్తు చేశారు. వెలకట్టలేనివి మీ త్యాగాలు అని ప్రధాని అమరులైన పోలీసులను ఉద్దేశించి భావోద్వేగంగా మాట్లాడారు. మీ త్యాగాలకు ఇవే మా జోహార్లు అని ఆయన వ్యాఖ్యానించారు. శాంతిమయ భావి భారతం కోసం తమ విలువైన ప్రాణాలు అర్పించిన పోలీస్‌ అమరవీరులకు ఇదే మా అశ్రునివాళి అని ప్రధాని అన్నారు. ప్రజాస్వామ్యం, సమాజ పరిరక్షణ కోసం నిరంతరం పోరాడే పోలీసులకు నా సెల్యూట్ అని ప్రధాని తెలిపారు.

Exit mobile version