కరోనా బారిన పడిన అన్నయ్య శ్రీ చిరంజీవి గారు సత్వరమే కోలుకోవాలని జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్‌కళ్యాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆచార్య సినిమా షూటింగ్‌లో పాల్గొనే ముందు విధిగా కోవిడ్ పరీక్ష చేయించుకున్న చిరంజీవికి పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో, పవన్ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుండి నడిపించే అన్నయ్యకు కరోనా సోకడం బాధాకరం అన్నారు. లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి అన్నయ్య చాలా జాగ్రత్తగా ఉన్నారని, ఎంతో ఆరోగ్యకరంగా ఉన్నారని తెలిపారు. విధిగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాంటి వ్యక్తికి కోవిడ్ సోకడంతో మేమంతా విస్తుపోయామని కళ్యాన్ తెలిపారు.
ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ కరోనా పాజిటివ్ రావడంతో తాము దిగులుగా ఉన్నామని పవన్ అన్నారు. అన్నయ్య త్వరగా కోలుకోవాలని ఆ భగవండ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కరోనా వ్యాక్సిన్ కోసం చేస్తున్న ప్రయోగాలు త్వరగా ఫలవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రపంచమంతా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తోందన్నారు. కాగా, నిన్న మధ్యాహ్నం తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని స్వయంగా చిరంజీవి ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు పరీక్షలు చేసుకోవాల్సిందిగా ఆయన విన్నవించారు. తను హోమ్ క్వారంటైన్లో ఉంటున్నట్లు తెలిపిన చిరు.. ఎప్పటికప్పుడు తన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తానన్నారు.
కాగా, ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విధుల్లోకి వెళ్లాలని పవన్ తెలిపారు. కాలక్షేపం కోసం బయటికెల్లినా మాస్క్, శానటైజర్ తప్పకుండా వాడాలని సూచించారు. సోషల్ డిస్టేన్స్ తప్పకుండా పాటించాలని పవన్ తన అభిమానులకు, ప్రజలకు తెలియజేశారు.