- మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం
- మృతదేహాలు స్వస్థాలకు చేర్చేందుకు సీఎస్‌కు ఆదేశం
సికిందరాబాద్ బోయగూడలో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన చాలా దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో బీహార్ కార్మికులు మృతి చెందడం పట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కార్మికుల మృతదేహాలను వారి స్వస్థాలకు తరలించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మృతులకు ఆర్థిక సహాయం కింద రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మంగళవారం తెల్లవారుజామున బోయగూడలోని ఐడిహెచ్ కాలనీలో టింబర్‌డిపోలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షాట్ సర్య్కూట్ వల్ల గోదాం మొత్తం తగలబడిపోయింది. అయితే ఈ డిపోలో బీహార్‌కు చెందిన 15 మంది కార్మికులు నిద్రించారు. వీరిలో 11 మంది సజీవ దహనమయ్యారు.