end

రామ మందిర శకటానికే ప్రథమ పురస్కారం

న్యూఢిల్లీ: జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాజధాని నగరంలో కవాతులో ప్రదర్శించిన శకటాల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన శకటానికి ప్రథమ పురస్కారం లభించింది. అయోధ్య రామమందిర నమూనాతో పాటు ఆ నగర సాంస్కృతిక వారసత్వాన్ని , రామాయణంలోని కీలక ఘట్టాలను శకటంపై ఆవిష్కరించారు. ఈ శకటం వీక్షకులతో పాటు జ్యూరీని సైతం మెప్పించింది. ఇక ఆత్మనిర్భర్‌ భారత్‌ను సాధించేందుకు పర్యావరణ అనుకూల సాంప్రదాయ ఆచరణను ప్రోత్సహించేలా ఉన్న త్రిపుర రాష్ట్రానికి చెందిన శకటానికి ద్వితీయ అవార్డు, ఉత్తరాఖండ్‌ ప్రదర్శించిన శకటానికి తృతీయ పురాస్కారాలు అభించాయి.

Exit mobile version