end
=
Saturday, January 18, 2025
వార్తలుజాతీయంGujarat Election:గుజరాత్‌లో మొదలైన తొలి దశ ఫైట్
- Advertisment -

Gujarat Election:గుజరాత్‌లో మొదలైన తొలి దశ ఫైట్

- Advertisment -
- Advertisment -

  • పోలింగ్ కోసం సర్వం సిద్ధం చేసిన అధికారులు
  • 8 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఓటింగ్


దేశంలో గుజరాత్ ఎన్నికల మేనియా (Gujarat Election) నెలకొంది. గురువారం తొలి విడత ఎన్నికల పోలింగ్ (First round of election polling) జరగనుంది. గురువారం (డిసెంబర్ 1న) జరిగే పోలింగ్ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. గుజరాత్‌లో తొలి దశ ఎన్నికల్లో సౌరాష్ట్ర-కచ్‌తో (Saurashtra-Kutch) సహా దక్షిణ గుజరాత్‌లోని 19 జిల్లాల్లోని 89 స్థానాలకు పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 1 గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. గుజరాత్ ఎన్నికలు ఢిల్లీ రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయి. గుజరాత్‌లో వరుసగా ఏడోసారి కాషాయ జెండాను ఎగురవేసి.. ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని బీజేపీ (BJP) సర్వశక్తుల్ని ధారపోసింది. కమలం కంచుకోటను బద్దలుకొట్టాలని కాంగ్రెస్‌ (Congrss) ప్రయత్నిస్తుండగా.. ఢిల్లీ, (Delli) పంజాబ్‌ (Panjab)సూత్రంతో గుజరాత్‌ను కైవసం చేసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) దూకుడును ప్రదర్శించింది. ఇప్పటివరకు గుజరాత్‌లో కేవలం బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ ఉండగా.. తాజాగా ఆప్‌ అరంగేట్రంతో గుజరాత్ ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొంది. తొలి విడత ఫైట్‌లో దక్షిణ గుజరాత్‌, సౌరాష్ట్ర, కచ్‌ ఓటర్లు ఈసారి ఎలాంటి తీర్పు ఇస్తారోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

తొలి దశ ఎన్నికల్లో మొత్తం 788 మంది అభ్యర్థులు (candidates)బరిలో ఉన్నారు. తొలి దశలో మొత్తం 39 రాజకీయ పార్టీల (Party) అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలివిడతలో 2 కోట్ల 39 లక్షల మంది ఓటర్లు (voters) ఓటు వేయనున్నారు. 6 లక్షల మంది ఓటర్లు తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొదటి దశకు 25 వేల 430 పోలింగ్ బూత్‌లు (poling booth) ఏర్పాటు చేశారు. 34,324 బ్యాలెట్‌ యూనిట్లు (Ballet unit), 34,324 కంట్రోల్‌ యూనిట్లు (Control unit), 38,749 వీవీప్యాట్‌ (VVPAT)లను వినియోగించనున్నారు. పోలింగ్ నేపథ్యంలో బూత్‌ల వద్ద కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించారు.

ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాలు:
మొత్తం ఓటర్లు.. 2,39,76,670
పురుషులు: 1,24,33,362
మహిళలు: 1,15,42,811
ట్రాన్స్‌జెండర్లు 497 మంది ఉన్నారు.

ఇక డిసెంబర్‌ 5వ తేదీన రెండో దశ పోలింగ్‌ జరుగుతుంది. రెండోదశలో 93 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. అయితే తొలి దశ బరిలో బీజేపీ సీనియర్‌ నేతలు పురుషోత్తమ్‌ సోలంకీ, కువర్జీ బవాలియా, క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబా, ఆమ్‌ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి ఇసుదాన్‌ గఢ్వీ, ఆప్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్‌ ఇటాలియా (Senior BJP leaders Purushottam Solanki, Kunvarji Bavalia, cricketer Ravindra Jadeja’s wife Rivaba, Aam Aadmi Party CM candidate Ishardan Gadhvi, AAP state president Gopal Italia. )సహా 788 మంది అభ్యర్థులు ఉన్నారు. 19 జిల్లాల్లోని 89 స్థానాలకు గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. తొలి దశలో మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 2 కోట్ల 39 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

(YS Sharmila:ఆస్తులపై విచారణ చేపట్టే దమ్ముందా)

జోరందుకున్న రెండో దశ ప్రచారం..
ఓవైపు గురువారం తొలి దశ పోలింగ్‌ జరుగుతుందడగా రెండో దశ ఎన్నికల ప్రచారం కూడా ఊపందుకుంది. సీఎం భూపేంద్ర పటేల్‌ అహ్మాదాబాద్‌లో రోడ్‌షో (CM Bhupendra Patel Roadshow in Ahmedabad) నిర్వహించారు. అసర్వలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. ప్రధాని మోదీ (Union Home Minister Amit Shah. Prime Minister Modi) ని రావణుడితో పోల్చిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జుర్‌ ఖర్గే (President Mallikarjun Kharge) తీరును తీవ్రంగా తప్పుపట్టారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ (Defense Minister Rajnath Singh). కాంగ్రెస్‌ పార్టీ సంస్కృతికి ఆయన వ్యాఖ్యలు అద్దం పట్టాయన్నారు. గుజరాత్‌లో బీజేపీ అభ్యర్దుల తరపున ఆయన ప్రచారం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఈసారి యాంటీ రాడికల్‌ సెల్‌ (Anti-radical cell)ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డా (BJP President Nadda) ప్రచార బాధ్యతలపై తమ భుజాలపై వేసుకున్నారు. వారంలో నాలుగు రోజులు గుజరాత్‌‌లోనే గడుపుతున్నారు ప్రధాని మోదీ. సారి ఎలాగైనా అధికారం నిలబెట్టుకోకపోతే ఆ ప్రభావం 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీపై పడుతుందని భావిస్తున్న బీజేపీ.. తీవ్రంగా పోరాడుతోంది. ఇక గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌ల మధ్య ముక్కోణపు పోరు సాగుతోంది. ఇందులో బీజేపీ మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తుండగా. దానికి అడ్డుకట్టే వేసేందుకు కాంగ్రెస్, ఆప్ ప్రయత్నిస్తున్నాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -