end

శానిటేషన్‌ వర్కర్‌కు తొలి టీకా

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. శనివారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి 3,006 కేంద్రాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ మొదలైంది. దేశంలో తొలి కరోనా టీకాను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్యులు శానిటేషన్‌ వర్కర్‌ మనీష్‌ కుమార్‌కు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్‌ వైద్య బృందంతో పాటు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్‌ పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోనూ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలైంది. సర్వజనాసుపత్రి (జీజీహెచ్‌)లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. జీజీహెచ్‌లో హెల్త్ వర్కర్‌ పుష్పకుమారికి తొలి టీకా ఇచ్చారు. అనంతరం హెల్త్ వర్కర్ నాగజ్యోతి, హెల్త్ వర్కర్ జయకుమార్‌కు టీకా వేశారు. తెలంగాణలో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాంధీ ఆస్పత్రిలో హెల్త్ వర్కర్‌ కృష్ణమ్మకు తొలి వ్యాక్సిన్ వేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.

Exit mobile version