end
=
Tuesday, January 21, 2025
సినీమాప్రేమలో మునిగి తేలుతున్నా మాజీ మిస్‌యూనివర్స్‌
- Advertisment -

ప్రేమలో మునిగి తేలుతున్నా మాజీ మిస్‌యూనివర్స్‌

- Advertisment -
- Advertisment -

మాజీ మిస్‌యూనివర్స్‌, బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌తో డేటింగ్‌లో ఉన్నానంటూ మాజీ ఐపీఎల్‌ ఛైర్మన్‌ లలిత్‌ మోడీ షేర్‌ చేసిన పోస్ట్‌ అటు సినిమా ఇండస్ట్రీ, ఇటు క్రికెట్‌ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. సుస్మితతో కొత్త జీవితం ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ, త్వరలో తాము పెళ్లికూడా చేసుకుంటామంటూ ఆయన షేర్‌ చేసిన ఫొటోలు నెట్టింట్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈక్రమంలో వారికి పెళ్లికూడా అయిపోయిందంటూ కొందరు శుభాకాంక్షలు కూడా తెలిపారు. దీంతో లలిత్‌ మోడీ తమకింకా పెళ్లవలేదని ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చాడు. తాజాగా సుస్మితాసేన్‌ సైతం ఈ డేటింగ్‌ విషయంపై స్పందించింది.

లలిత్ మోదీతో తనకున్న సంబంధాలపై ఓ పోస్ట్‌ను పంచుకుంది. సుస్మితా సేన్ తన ఇద్దరు కుమార్తెలు రెనే అలీషాతో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను పెట్టింది. ప్రస్తుతం నేను నాకు నచ్చిన ప్రదేశంలో ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇంకా ఉంగరాలు మార్చుకోలేదు, పెళ్లి కాలేదు. ప్రేమలో మునిగి తేలుతున్నా ఈ క్లారిటీ సరిపోతుందనుకుంటా. ఇక నా పని నేను చూసుకుంటా. నా ఆనందాన్ని పంచుకునేవారికి థ్యాంక్యూ. ఎవరైతే పంచుకోరో వారికి నా గురించి అవసరం లేదు. ఏదేమైనా లవ్‌ యూ గయ్స్‌’ అని రాసుకొచ్చింది. లలిత్ మోడీతో తనకున్న సంబంధాలపై సుస్మితా సేన్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. సుస్మితా సేన్‌తో క్లోజ్‌గా ఉన్న కొన్ని ఫోటోలను లలిత్ మోడీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆమెతో తనకు ఉన్న రిలేషన్‌పై వెల్లడించారు. ఇద్దరూ ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నారని చెప్పారు. అయితే లలిత్ మోడీతో సుస్మితకు ఉన్న సంబంధం గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -