హరీష్ రావు మాట్లాడుతూనిమ్స్ ఆసుపత్రి(Nims Hospital)లో దాదాపు రూ. 2 కోట్లతో సమకూర్చుకున్న ఇంట్రా ఆపరేటివ్ ఆల్ట్రా సౌండ్, ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్, ఆల్ట్రా సోనిక్ ఆస్పిరేట్ వైద్య పరికరాలను ట్రామా బ్లాక్ (EMD)లోని మూడో ఫ్లోర్ లో ప్రారంభించడం సంతోషంగా ఉంది.మారుతున్న సాంకేతికత అందిపుచ్చుకునేలా వస్క్యులర్ సర్జరీ సింపోసియం నిర్వహించడం గొప్ప విషయం.వైద్యులు నిత్య విద్యార్థులు. రోజు ఎంతో సాంకేతికత పెరుగుతున్నది. ప్రముఖ కిడ్నీ స్పెషలిస్టు(Kidney Specialist) దామోదర్ రెడ్డి కుంబాల గారు మంచి హృదయంతో వచ్చి మనకు నైపుణ్యాలు పెంచుతున్నారు.డయాలసిస్ సేవలు అందించడంలో తెలంగాణ ఛాంపియన్. స్టాలిన్ గారు తెలంగాణ మోడల్ అడాప్ట్ చేస్తున్నాం అన్నారు. తెలంగాణ(Telangana) ఏర్పాటుకు ముందు కేవలం 3 డయాలిసిస్ కేంద్రాలు 102 కి పెంచుతున్నాం.డయాలిసిస్ మీద తెలంగాణ ప్రభుత్వ ఏటా వంద కోట్లు ఖర్చు చేస్తున్నాం.డయాలసిస్ వారికి బస్ పాస్, పింఛన్లు, జీవిత కాల మందులు ఉచితంగా అందిస్తున్నాం.డయాలసిస్ పేషెంట్లకు
తెలంగాణ ప్రభుత్వం కొండంత అండ ఇస్తున్నది.తెలంగాణలో 50 లక్షల డయాలసిస్ సైకిళ్ళు పూర్తి చేశాం.రోగం రాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. తెలంగాణ ప్రభుత్వం సురక్షిత మంచి నీరు అందిస్తున్నది.ప్రతి ఇంటికి ఉపరితల మంచి నీరు వంద శాతం అందిస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ ప్రజల్లో ఎక్కువ బీపీ షుగర్(BP, Sugar) వస్తున్నాయి. ప్రాథమిక దశలో గుర్తించి మందులు ఇస్తున్నది.ఎన్ సీ డీ స్క్రీనింగ్ చేస్తున్నం. మందులు ఇస్తున్నాం. పెద్ద వారికి అర్ధం అయ్యేలా వివిధ రంగుల మూడు పౌచుల్లో మందులు పెట్టీ అందిస్తున్నాము.పేదలకు అత్యున్నత వైద్యం నేడు తెలంగాణలో అరోగ్య శ్రీ(Arogya Shri)లో అందుతున్నది.మా నిమ్స్ ఆసుపత్రి వైద్యులు బాగా పని చేస్తున్నారు.నిఫ్రాలజీ పనితీరు అద్బుతం.కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ అత్యధికంగా నిమ్స్ లో జరుగుతున్నాయి.జీవన్ దాన్ అవయవ దానం వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉంది. అందరం కలిసి అవయవదానం ప్రోత్సహించాలి.ఐసియూ పడకలు డబుల్ చేసుకున్నాము. గత ఏడాది వచ్చిన సమయంలో ఎక్విప్మెంట్ కోసం 150 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది.ప్రొఫెసర్ సహా ఇతర అన్ని పోస్టులు భర్తీ చేస్తాం. నిమ్స్ నీ మరింత బలోపేతం చేస్తాము. వైద్య సిబ్బంది ఓనర్ షిప్ తో పని చేయాలి. పేదలకు మంచి వైద్యం అందించాలి.