end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంఆశా కార్యకర్త వినోదను ప్రభుత్వం ఆదుకోవాలి
- Advertisment -

ఆశా కార్యకర్త వినోదను ప్రభుత్వం ఆదుకోవాలి

- Advertisment -
- Advertisment -

రంగారెడ్డి జిల్లా ఆశా కార్యకర్త సూదిని వినోద(36 ) జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు హైదరాబాద్‌ వెళ్లి, మృతి చెందారు. వివరాలు చూస్తే.. ఆమన్‌గల్ పురపాలక సంఘం ముర్తుజాపల్లికి చెందిన సూదిని వినోద ఆశా కార్యకర్త. ఎన్నికలలో విధులు నిర్వహించాలని ఆదేశాలు రావడంతో ఆమె 4న సోమవారం ఉదయం హైదరాబాద్ బయలుదేరారు. మల్కాజ్‌గిరి పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రంలో సోమవారం సాయంత్రం ఎన్నికలకు సంబంధించినసామాగ్రిని సిద్ధం చేసుకుంటూ ఉండగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు.

చికిత్స నిమిత్తం ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందారు. జీహెచ్ఎంసీ  ఎన్నికల ఆన్ డ్యూటీలో చనిపోయిన వినోదను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఆశా వర్కర్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు జి కవిత డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే వారి కుటుంబాన్ని ఆదుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ కు వినతిపత్రం సమర్పించి తగిన న్యాయం చేయాలని కోరారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -