end
=
Thursday, November 21, 2024
వార్తలురాష్ట్రీయంరైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి..
- Advertisment -

రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి..

- Advertisment -
- Advertisment -

-సీపీఎం జిల్లా కార్యదర్శి మాణిక్యం
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతాంగాన్ని, ఇల్లు కోల్పోయిన ప్రజలను తక్షణమే ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మాణిక్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు జిల్లాలోని రైతుల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. పత్తి, వరి, చెరుకు, సొయా, పలు కూరగాయలు నీట మునిగాయన్నారు. జిల్లాలో రైతులు సుమారు 1500 కోట్ల రూపాయల పంటలు నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 40 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్సూరెన్సులు కట్టకుండా రైతులను మోసం చేసిందని, కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే ఎకరాకు 40వేలు పరిహారం ఇవ్వాలన్నారు. ఇండ్లు కూలిపోయిన వారికీ ప్రభుత్వం తక్షణమే లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించాలని ఆయన అన్నారు. పాడైన రోడ్లు, చెరువుల మరమ్మతులు చేయాలని వారు డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ ప్రభుత్వ అధికారులు పర్యటించి రైతులను ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం విపత్తుగా ప్రకటించి జిల్లాకు 2వేల కోట్లు కేటాయించాలన్నారు. రైతు రుణాలు మాఫీ చేయాలనీ, రైతులకు అండగా ఉండి ప్రభుత్వం భరోసా కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం ఏరియా కమిటీ కన్వీనర్ చిరంజీవి, గణపతి, అంజా గౌడ్, నర్సింలు, భూమ గౌడ్, జీవన్ కుమార్, సంతోష్ తదితరులు ఉన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -