end

రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి

  • టీపీసీసీ సభ్యులు సంజీవరెడ్డి

నిమజ్జనం సమయంలో జాగ్రత్తగా ఉండాలి

సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతాంగాన్ని, ఇల్లు కోల్పో యిన ప్రజలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని టీపీసీసీ సభ్యులు సంజీవరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు జిల్లాలోని రైతులు తీవ్రంగా నష్టపోయారనీ.. వరి, చెరుకు, సొయా, కూరగాయలు నీట మునిగి నాశనమయ్యాయనీ.. చేతికొచ్చిన పత్తి పంట వర్షం కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

దొరికిపోతామనే భయంతోనే..

రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇండ్లు కూలిపోయిన వారికీ ప్రభుత్వం తక్షణమే లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించాలని తెలిపారు. పాడైన రోడ్లు, చెరువులను మరమ్మతులు చేయించాలని ఆయన అన్నారు. ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులను ఆదుకోవాలని కోరారు. రైతుల రుణాలు మాఫీ చేసి, వారికి ప్రభుత్వం అండగా నిలవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సుభాష్ పాటిల్, సిద్ధారెడ్డి, రాజు గుప్తా, శంకర్ గుప్తా, అశోక్ తదితరులున్నారు.

ఎక్కిళ్లు వస్తున్నాయా.. అయితే ఇలా చేయండి

Exit mobile version