- మండల బీజేపీ అధ్యక్షులు ప్రభాకర్ యాదవ్
మెదక్ జిల్లా, రేగోడు మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రైతుల పంటలన్నీ నీటిపాలయ్యాయనీ, రైతులను ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించి, ఆదుకోవాలని రేగోడు తాహసీల్దార్ సత్యనారాయణకు బీజేపీ మండల అధ్యక్షుడు ప్రభాకర్ యాదవ్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికారులు గ్రామాల్లోకి వెళ్లి రైతులు నష్టపోయిన పంటలను అంచనావేసి, ప్రతి రైతుకు ఎకరానికి 25 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ కన్వీనర్ వీరన్న, శ్రీనాథ్ చారి, నర్సింలు, తదితరులు ఉన్నారు.