end
=
Friday, November 22, 2024
వార్తలుఅంతర్జాతీయంTwitter:ట్విట్టర్‌కు షాకిచ్చిన హ్యాకర్స్
- Advertisment -

Twitter:ట్విట్టర్‌కు షాకిచ్చిన హ్యాకర్స్

- Advertisment -
- Advertisment -
  • 20కోట్ల ఆకౌంట్స్‌పై ప్రభావం

Twitter : ఇప్పటికే అష్టకష్టాలు పడుతున్న ట్విట్టర్‌ (Twitter)కు మరో భారీ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఎలన్ మస్క్ (Elon Musk) చేతిలోకి వచ్చినప్పటినుంచి ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతున్న ట్విట్టర్‌కు తాజాగా హ్యాకింగ్ (hacked) సమస్య ఎదురైనట్లు ఓ వార్త ఇప్పుడు కలకలం రేపుతోంది. అంతేకాదు దాదాపు 20కోట్లకుపైగా ఆకౌంట్స్ హ్యాకింగ్‌కు (More than 20 crores for hacking accounts) గురయ్యాయని తెలుస్తోంది. వీటి నుంచి హ్యాకర్లు.. ఈమెయిల్ ఐడీలు (Hackers.. email ids)దొంగలించారని సమాచారం. కాగా సంబంధిత యూజర్ల ఈమెయిల్​ఐడీలను దొంగిలించి.. ఆన్​లైన్​హ్యాకింగ్ ఫోరంలో (hacking forum) అందుబాటులో ఉంచినట్టు ఓ సెక్యూరిటీ రీసెర్చర్ (Security Researcher)వెల్లడించింది. దీంతో సోషల్ మీడియా వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

ఈ మేరకు దీనిపై స్పందించిన ఇజ్రాయెల్​సైబర్​సెక్యూరిటీృ మానిటరింగ్ సంస్థ హుడ్సన్ రాక్ సహ వ్యవస్థాపకుడు ఆలోన్‌గాల్ (Alongal is the co-founder of Hudson Rock, an Israeli cybersecurity monitoring firm).. టార్గెటెడ్ ఫిషింగ్, డాక్సింగ్ (Targeted Phishing, Doxxing)​వంటివి జరుగుతాయని అభిప్రాయపడ్డారు. తాను చూసిన అతిపెద్ద ‘డేటా లీక్స్’ (Data leaks)లో ఈ తాజా ఘటన ఒకటి అని వివరించారు. అయితే ట్విట్టర్​హ్యాకింగ్​(Twitter Hacking) విషయాన్ని తొలిసారిగా గతేడాది డిసెంబర్​24న పోస్ట్ చేశారు ఆలోన్​గాల్. ఈ వ్యవహారంపై ట్విట్టర్ ఇంకా స్పందించలేదు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు నిజమేనా? ఒకవేళ నిజమే అయితే.. ఈ వ్యవహారంపై ఎలాంటి దర్యాప్తు చేపట్టారు? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వంటి మీడియా ప్రశ్నలకు ట్విట్టర్​ ఇంకా జవాబు చెప్పలేదు. డేటా బ్రీచ్‌కు కారణమైన హ్యాకర్స్, వారి లోకేషన్స్‌కు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు కూడా లేవు. అయితే.. ఈ డేటా బ్రీచ్ అనేది 2021 తొలినాళ్లల్లో జరిగి ఉంటుందని తెలుస్తోంది.

అయితే మొదటగా 40కోట్లకుపైగా ట్విట్టర్ యూజర్ల ఆకౌంట్ల హ్యాకింగ్ (Hacking of accounts of more than 40 crore Twitter users)​గురయ్యాయని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆ సంఖ్య 20కోట్లకు తగ్గింది. ఈ యూజర్స్ అకౌంట్స్​నుంచి ఈమెయిల్ అడ్రస్‌లు, ఫోన్ నెంబర్‌లు (Email addresses, phone numbers) దొంగలించినట్టు తెలుస్తోంది.ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో పెను సంచనలనంగా మారింది. 20కోట్లకుపైగా యూజర్స్​ఈమెయిల్​ఐడీ హ్యాకింగ్‌కు గురవ్వడం పెద్ద విషయమే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ టెక్ యుగంలో ‘డేటా’ అనేది అత్యంత కీలకమైన విషయంగా మారింది. డేటా మన వద్ద ఉంటే.. బిలియన్​డాలర్లు సంపాదించుకునే మార్గాలు ఎన్నో ఉన్నాయి. అయితే.. హ్యాకర్స్ వీటిని అక్రమంగా దొంగలించి ఇతరులకు అమ్ముకుంటుండటం, యూజర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోంది. ఈ వ్యవహారంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలావుంటే.. రెండు నెలల క్రితమే 50 లక్షల మందికి పైగా యూజర్ల ట్విట్టర్ ఖాతాల డేటా (users’ private information) హ్యాకర్ల పాలైంది. తాజాగా 235 మిలియన్ యూజర్ల డేటా డార్క్ వెబ్‌‌లో ప్రత్యక్షమైంది. కోట్లాది మంది ట్విట్టర్ యూజర్ల డేటా హ్యాకింగ్‌కు గురైందని ఓ నివేదికలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఈ డేటా డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉంచినట్టు సదరు నివేదిక పేర్కొంది. ఈ మేరకు ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ హడ్సన్ రాక్ (Hudson Rock) వెల్లడించింది. దీంతో ట్విట్టర్ వినియోగదారుల ఈ-మెయిల్ ఐడీ, పేరు, యూజర్ నేమ్, ఫాలోవర్ల వివరాలు, ఫోన్ నెంబర్లను హ్యాకర్ డార్క్ వెబ్ లో విక్రయానికి ఉంచాడని వివరించింది. ట్విట్టర్ చరిత్రలో ఇప్పటిదాకా ఇదే అత్యంత భారీ డేటా లీకేజి అని హడ్సన్ రాక్ తెలిపింది. అయితే డిసెంబర్ నెలలో 400 మిలియన్ యూజర్ల డేటాను డార్క్ వెబ్‌‌లో పెట్టగా అందులో నుంచి డూప్లికేట్, ఫేక్ యూజర్ల వివరాలను ఫిల్టర్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తం 235 మిలియన్ల యూజర్లకు సంబంధించి మెయిల్ ఐడీలు, ఇతర వివరాలతో కూడిన ఫైల్‌‌ను సేల్‌కు పెట్టారు హ్యాకర్లు. దీంతో చాలా మంది తమ యూజర్ నేమ్‌, పాస్‌ వర్డులను మార్చుకుంటున్నట్లు ట్వీట్లు పెడుతున్నప్పటికీ ఈ సంఘటన కాస్త ఆందోళనకలిగించే అంశమేనని కొంతమంది వాపోతున్నారు.

(Warangal:వరంగల్ నగరంలో దారుణం)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -