బ్యాంకాక్: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో తామాడిన తొలి మ్యాచుల్లోనే భారత స్టార్ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, పివి సింధు పరాజయం పాలయ్యారు. మొదట శ్రీకాంత్.. డెన్మార్క్ షట్లర్ ఆండర్స్ ఆంటోన్‌సేన్ చేతిలో 15-21, 21-16, 21-18 తేడాతో ఓడిపోయాడు. తొలి రౌండ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన శ్రీకాంత్.. తదుపరి రెండు రౌండ్లలో డెన్మార్క్ షట్లర్‌కు పూర్తిగా తలొగ్గాడు.
మరో మ్యాచ్‌లో ఒలింపిక్ పతక విజేత పివి సింధు కూడా తొలి మ్యాచ్‌లోనే ఓటమి చవిచూసింది. ప్రపంచ నెం. 1 షట్లర్ తై జు యింగ్(చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్‌లో 21-19, 12-21, 17-21తో పరాజయం పాలైంది. తొలి సెట్ హోరాహోరీగా సాగినప్పటికీ సింధు సెట్‌ను 21-19తో చేజిక్కించుకుంది. ఇక రెండో సెట్లో సింధు పూర్తిగా తేలిపోయింది. చాలా అలవోకగా ప్రత్యర్థికి సెట్ అప్పగించేసింది. ఇక నిర్ణాయాత్మకమైన మూడో సెట్లో విజయం కోసం ప్రయత్నించినప్పటికీ.. 17-21తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను చేజార్చుకుంది. దీంతో ప్రతిష్టాత్మకమైన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత స్టార్ షట్లర్లు తొలి మ్యాచ్‌లోనే వెనుదిరగడంతో అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొని ఉంది.