end

ఇన్‌స్టాగ్రామ్‌ లో సరికొత్త ఫీచర్‌

సోషల్‌ మీడియా సైట్స్‌ లో సంచలనం సృష్టించిన ఇన్‌స్టాగ్రామ్‌. అతి తక్కువ సమయంలో ఎక్కువ మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్న సోషల్‌ మీడియా సైట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌ గుర్తింపు తెచ్చుకుంది. ఈ రోజుల్లో ఇన్‌స్టా లేకపోతే బ్రతకలేము అన్నంతగా అలవాటు పడిపోయారు జనాలు . చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒకరు దీనిని ఉపయోగిస్తున్నారు.ముఖ్యంగా యువత అభిరుచులకు అనుగుణంగా నచ్చినట్టు ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను తీసుకొచ్చే ఇన్‌స్టా రోజురోజుకీ యూజర్లను పెంచుకుంటూపోతోంది. టిక్‌టాక్‌ బ్యాన్‌ తర్వాత ఇన్‌స్టా తీసుకొచ్చిన రీల్స్‌ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఈ ఫీచర్‌కు ఎక్కువ క్రేజ్‌ దక్కింది. ఇన్‌స్టా రీల్స్‌ కి వయసు తో పని లేదు ఎవరు అయిన చేయచ్చు. ఇన్‌స్టా రీల్స్‌ చేస్తూ ప్రజాదరణ(పాపులరిటీ) పొందవచ్చు

ఇదిలా ఉంటే రీల్స్‌లో మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి ఫేస్‌బుక్‌కు రీల్స్‌ను క్రాస్ పోస్టింగ్‌ చేసుకునే అవకాశం కల్పించనుంది. ఫేస్ బుక్ నుండి ఇన్‌స్టాగ్రామ్‌ కి పోస్ట్ చేయాలి అనుకుంటే పిక్స్ ని యాడ్ చేస్తే ఇంస్టా లో కూడా పోస్ట్ అవుతుంది. అంతేకాకుండా రీల్స్‌ కొత్త ఫీచర్లు, అప్‌డేట్స్‌ను విడుదల చేయనున్నారు. ఈ కొత్త ఫీచర్‌ ద్వారా కేవలం ఒకే బటన్‌ ప్రెస్ చేయడం ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి ఫేస్‌బుక్‌కు రీల్స్‌ క్రాస్‌ పోస్ట్‌ చేసుకునే అవకాశం లభిస్తుంది. అలాగే స్టోరీస్‌లో పాపులరైన ‘యాడ్‌ యువర్స్‌ స్టిక్కర్‌’ ఫీచర్‌ను రీల్స్‌లోనూ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్లను త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి.

Exit mobile version