end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంఒకే చోట తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్య నేతలు
- Advertisment -

ఒకే చోట తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్య నేతలు

- Advertisment -
- Advertisment -

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ప్రముఖ లీడర్లంతా ఒకే చోట చేరారు. పార్టీ సీనియర్‌ నేత రాహుల్ గాంధీ రైతులకు మద్దతుగా చేపట్టిన ‘మార్చ్’ కార్యక్రమం సందర్భంగా ఓ ఫొటో పార్టీ కార్యకర్తలకు ఉత్సాహానిచ్చిందని చెప్పవచ్చు. వారెవరంటే.. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి. ఈ అరుదైన సన్నివేశం దొరికినప్పుడు ఫోటోగ్రాఫర్లు ఊరుకుంటారా..? తమ కెమెరాలకు పని చెప్పరు..! వీరికోసం చాలా మంది ఫోటో గ్రాఫర్స్‌ ఎగబడ్డారు.

ఇక్కడ విశేషమేమంటే.. ఒకరేమో పీసీసీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే.. మరో ఇద్దరు పీసీసీ చైర్మన్ పదవి కోసం పోటీపడుతున్నవారు. కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి మధ్యే పీసీసీ కుర్చీ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలని కాంగ్రెస్ అధిష్ఠానం తలలు పట్టుకున్న వేళ.. ఈ ముగ్గురూ ఇలా ఒక చోట చేరడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -